బాబు బంగారం సినిమా రివ్యూ

సినిమా పిల్లర్ : దర్శకత్వం : మారుతి నటీనటులు : వెంకటేష్, నయనతార, సంపత్, పోసాని కృష్ణ మురలి, వెన్నెల కిషోర్, పృధ్వీ తదితరులు. గోపాల గోపాల, దృశ్యం వంటి చిత్రాల తరువాత కుటుంబ చిత్రాల హీరో వెంకటేష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని నటించిన సినిమా " బాబు బంగారం ". మారుతి గతం లోనే వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. పట్టు వదలకుండా ఆయనే సినిమా చేసి తీరాలని ఎంతో నమ్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. వెంకీ సరసన నయనతార నటించింది. వీరిద్దరు మంచి హిట్ పెయిర్. మరి మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయిందో లేదో చూద్దాం. కథ: కృష్ణ(వెంకటేష్) జాలి గల పోలీస్ ఆఫీసర్. తన వల్ల నేరం చేసే వాళ్ళు కూడా బాధ పడకూడదని ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి కష్టాల్లో ఉన్న శైలజ(నయనతార) అనే అమ్మాయి తారస పడుతుంది. తన కన్నీళ్లు చూసి చలించిపోయిన కృష్ణ తనకు సహాయం చేయాలని భావిస్తాడు. మొదటి చూపులోనే తనను ఇష్టపడతాడు కూడా. శైలజ బావ బాబ్జీ(పృద్వి) ద్వారా తన కుటుంబానికి దగ్గరవుతాడు. శైలజకు ఉన్న ఒక్కో సమస్యను తీరుస్తూ.. తనను సంతోషంగా చూసుకుంటాడు కృష్ణ. ఇది ఇలా ఉండగా శైలజ తండ్రి శాస్త్రి(రాధారవి) ఓ కేసులో ఇరుక్కొని పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో శాస్త్రిని చంపడానికి మల్లేశ్ యాదవ్(సంపత్) ప్రయత్నిస్తుంటాడు. ఎమ్మెల్యే పుచ్చయ్య(పోసాని కృష్ణమురళి) మల్లేశ్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఇంతకీ శైలజ తండ్రిని మల్లేశ్ యాదవ్ ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు..? శాస్త్రి నిజంగానే నేరస్తుడా..? కృష్ణ కావాలనే శైలజ కుటుంబానికి దగ్గరయ్యడా..? కృష్ణే, శాస్త్రిని అరెస్ట్ చేశాడా..? అతను చేసిన నేరం ఏమిటి..? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. విశ్లేషణ: కష్టాల్లో ఉన్న అమ్మాయికి దగ్గరవ్వడం, ఆమె కష్టాలను తీర్చడం, తనను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ..... ఇటువంటి పాయింట్స్ తో వందల కొద్దీ సినిమాలొచ్చాయి. అయితే రొటీన్ కథను రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఎంటర్టైన్మెంట్ తో చెప్పాలని దర్శకుడిగా మారుతి చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. హీరోతో సహా సినిమాలో ఉన్న చాలా క్యారెక్టర్లు ఆడియన్స్ ను నవ్విస్తాయి. మొదటి భాగంలో జాలి గల పోలీస్ గా కనిపించే వెంకటేష్ రెండో భాగంలో టర్న్ తీసుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 'ఇప్పటివరకు టైగర్ వెజ్ తింటే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు నాన్ వెజ్ తింటే ఎలా ఉంటుందో.. చూడండి' అంటూ వెంకీ చెప్పే డైలాగ్స్ కు థియేటర్ లో చప్పట్లే చప్పట్లు. బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్ అంటూ.. ఆ సినిమాలో ఉండే 'అయ్యో అయ్యో అయ్యాయో' అనే డైలాగ్ తో పాటు కొన్ని ట్యూన్స్ ఉపయోగించారు. అవి ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. జిబ్రన్ బాణీలు కూడా ఫ్రెష్ గా అనిపిస్తాయి. "బాబు బంగారం " అంటూ వచ్చే టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్ విపరీతంగా నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. ఫోటోగ్రఫి అందంగా ఉంది. సినిమా కొంచెం ల్యాగ్ అయిందనే ఫీలింగ్ అనిపించినా.. అప్పటికే ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఆ మైనస్ పెద్దగా పట్టించుకోరు. ఎప్పటిలానే ఈ సినిమాలో నయనతార తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. పోసాని కృష్ణ మురలి, పృధ్వీ, వెన్నెల కిషోర్ ల కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. యూత్, ఫ్యామిలీ, పిల్లలు ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ చూడగలిగే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బాబు బంగారం'. రేటింగ్: 2.5/5

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.