గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రివ్యూ..

సినిమా పిల్లర్- నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటించిన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఎక్స్ క్లూజివ్ రివ్యూ ఫల్ న్యూస్ పిల్లర్ రీడర్స్.... సినిమా- గౌతమీపుత్ర శాతకర్ణి నటీనటులు- బాల‌కృష్ణ‌, శ్రియ‌, హేమ‌మాలిని, క‌బీర్ బేడి, శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు నిర్మాత‌లు- వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్ల‌మూడి క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి న్యూస్ పిల్లర్ రేటింగ్- 8/10 పరిచయం....... సాధారనంగా నందమూరి బాల‌కృష్ణ‌ను సంక్రాంతి హీరో అంటారు. ఆయ‌న సినిమాలు సంక్రాంతికొచ్చాయంటే సంద‌డే సంద‌డి. ఇలా సంక్రాతికి విడుదలైన బాలకృష్ణ సినిమాలు దాదాపు విజయం సాధించాయి. మ‌రోసారి పండ‌గ సంద‌ర్భంగానే బాల‌య్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈసారి వ‌చ్చిన ఈ చిత్రం బాల‌కృష్ణ సినీ ప్ర‌యాణానికి ఓ కీల‌క‌మైన మైలురాయిలాంటి వందో చిత్రం. అది కూడా చారిత్రాత్మ‌క క‌థ‌తో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రాత్మ‌క పాత్ర‌ల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ త‌ర‌హా క‌థ‌లని న‌మ్మి సినిమా చేయ‌డంలోనూ త‌న‌కి తానే సాటి అయిన బాల‌య్య త‌న వందో చిత్రంగా `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` చేయ‌డం విశేషం. కధ... ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటారు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి(కబీర్‌బేడీ)ని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తారు. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తారు. అయితే.. అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ ని శాతకర్ణి ఎలా ఓడించాడు.. తాను కలలుగన్న అఖండభారతావనని ఎలా సృష్టించాడు.. అన్నదే గౌతమీపుత్ర శాతకర్ణి. కధనం............. తెలుగు జాతి తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమే గౌతమీపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ కోసమే పుట్టిన కథ ఇది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన మాత్రమే చేయగలరేమో అనిపించేలా ఉంటుందీ సినిమా. ప్రధానంగా యుద్ధ ఘట్టాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. కానీ వాటిల్లోనే బలమైన భావోద్వేగాలు.. నహపాణుడిని ఓడించే సన్నివేశాలు.. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట దృశ్యాలు సినిమాకే తలమానికం. నహపాణుడు సామంతరాజల వారసులని తనదగ్గర బంధించి.. యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణిని తన కొడుకు పులోమావిని తీసుకుని రమ్మని చెప్తాడు. అందుకు తగ్గట్లే శాతకర్ణి యుద్ధానికి కుమారుడిని తీసుకెళ్తాడు. దానిపై శాతకర్ణి భార్య వాసిష్ఠి దేవి అడ్డుచెప్పే సన్నివేశాలు ప్రేక్షకులన్ని ఉద్వేగానికి గురిచేస్తుంది. ఇక రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువు పట్టులా నిలిచాయి. మాతృమూర్తి గొప్పతనాన్ని చాటిచెబుతూ ఆ ఘట్టాలు సాగుతాయి. డెమిత్రియస్‌ పై యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినప్పటికీ అందులో బాలకృష్ణ చేసే విన్యాసాలు, ఆయన నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక సంభాషణలు సినిమాకు ప్రధాన బలం. యుద్ధ సన్నివేశాలకు దీటుగా ఒకొక్క మాట ఓ తూటాలా పేలింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనే భావన తెరపై ఎక్కడా కలగదు. ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్‌ అంశాలను జోడించి చెప్పిన విధానం క్రిష్‌ పనితనానికి అద్దం పడుతుంది. నటీనటుల ప్రతిభ........ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణ ఒన్‌ మాన్‌ షో గా సాగింది. ఓవైపు భావోద్వేగాలను ఎంత అద్భుతంగా పండించారో.. మరోవైపు పోరాటఘట్టాల్లోనూ ఆయన ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ చురుగ్గా కన్పించారు. అలాగని ఇతర పాత్రలని తక్కువగా చెప్పలేం. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రియ వాసిష్ఠిదేవిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. నహపాణుడిగా కబీర్‌ బేడి ఆకట్టుకుంటారు. సాంకేతికంగా ఈ సినిమాకు వందకు వంద మార్కులు వేయాల్సిందే. ఇక దర్శకుడు క్రిష్ పనితనం అడుగడుగునా కన్పిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా శాతవాహనుల కాలంలో ఉన్నామేమో .. శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇదొక చారిత్రాత్మక చిత్రమనే భావన కలగనీయకుండా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయిసాయిమాధవ్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణల చాతుర్యం కన్పిస్తూనే ఉంటుంది. యుద్ధం ఆవశ్యకతని బాలకృష్ణ, హేమమాలిని చెప్పే సంభాషణలతో పాటు బౌద్ద గురువులు ‘నువ్వు కడుపున మోస్తున్నది ఓ మారణహోమాన్ని’ అని చెప్పే మాటలు థియేటర్‌ లో మరింత ప్రభావంగా విన్పించాయి. సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు ఇలా వేటికమే అధ్బుతం అనిపించకమానదు.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.