" హైపర్ " మూవీ రివ్యూ.

కాస్టింగ్ : హీరో రామ్, హీరోయిన్ రాశి ఖన్నా సంగీతం: జిబ్రాన్ (పాటలు) , మణిశర్మ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) కెమెరా : సమీర్ రెడ్డి ఎడిటింగ్: గౌతం రాజు మాటలు: అబ్బూరి రవి నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్ ఇంట్రడక్షన్: నేను శైలజ సినిమాతో తన సత్తా ఏంటో బయట పెట్టాడు హీరో రామ్. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ తో ‘‘హైపర్’’ మూవీతో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే నాన్నను అతిగా ప్రేమించే కొడుకు కథతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘‘హైపర్’’ మూవీ హిట్టా ఫట్టా.. న్యూస్ పిల్లర్ రివ్యూ .. స్టోరీ లైన్ :: సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అయిన నారాయణ మూర్తి (సత్యరాజ్) కొడుకు సూర్య (రామ్).. తండ్రంటే అమిత ప్రేమ.. మినిస్టర్ అయిన రాజప్ప (రావు రమేష్) కు చెందిన షాపింగ్ మాల్ నిర్మాణం సరిగా లేదని అప్రూవల్ సంతకం పెట్టనంటాడు సూర్య నారాయణ.. మినిస్టర్ ఇగో దెబ్బతిని తన పవర్ తో సూర్య నారాయణ మీద అటాక్ చేస్తాడు. తన తండ్రికి చిన్న హాని జరిగినా తట్టుకోలేని సూర్య.. మినిస్టర్ నుంచి తండ్రిని ఎలా కాపాడుకుంటాడన్నదే కథ, కథనం. హీరో రామ్ చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. రావు రమేష్ ను చాలెంజ్ చేసే సీన్స్ లో పవర్ ఫుల్ డైలాగ్ లతో అదరగొట్టాడు. రాశీ ఖన్నా ను పాటలకే పరిమితం చేశారు తప్ప.. పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాదు. కనిపించిన కొద్ది సేపు గ్లామరస్ గా కనిపించింది. సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో సత్యరాజ్, రావు రమేష్ విలన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు. విలన్ పర్ఫార్మెన్స్ సెకండాఫ్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. పాటల్లో కూడా సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ గా ఉంది. జిబ్రాన్ ఇచ్చిన పాటలు యావరేజ్ గా ఉన్నాయి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. దర్శకుడు సినిమాను రిచ్ గా తెరకెక్కించాడు. ఎడిటింగ్ యావరేజ్, మాటలు పర్వాలేదు. సత్యరాజ్ చెప్పిన డైలాగ్స్, సెకండాఫ్ లో రావు రమేష్ తో చెప్పిన కామెడీ డైలాగులు బాగా పేలాయి. విశ్లేషణ: ‘‘హైపర్’’ కథ ఎంటర్ టైనర్. కథలో కొత్తదనం లేకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగి నిజాయితి, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ లాంటి రెండు అంశాలు వర్కవుట్ కావడంతో ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్టాఫ్ సాఫీగా సాగిపోయినా.. సెకండాఫ్ సినిమా కు మైనస్ అయింది. స్క్రీన్ ప్లే సినిమాను దెబ్బతీసింది. తండ్రి కొడుకులు మధ్య సెంటిమెంట్ పండే సీన్ లు సైతం రక్తి కట్టించలేదు. లాజిక్ లేకుండా లాడిచే కథనం బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్ గా ‘‘హైపర్’’ రొటీన్ స్టోరీయే కాబట్టి టైం పాస్ కు ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5 కొసమెరుపు : అవకాశం ఉంటే వేరే సినిమాను ఎంచుకోండి

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.