జ‌న‌తా గ్యారేజ్ మూవీ రివ్యూ

కాస్టింగ్ : నిత్యామీనన్, ఉన్ని ముకుందన్

మ్యూజిక్ః దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫిః తిరునవుక్కరసు

ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడ్యూసర్స్ః నవీన్ యర్నేని, వై. రవిశంకర్, సి.వి. మోహన్

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ః కొరటాల శివ

ప్రొడక్షన్ కంపెనీః మైత్రీ మూవీ మేకర్స్

చాలా ప్లాప్ ల త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సినిమా జ‌న‌తా గ్యారేజ్‌. సినిమా పేరును చూస్తే ప‌క్కా మాస్ మ‌సాలా సినిమా అనిపించ‌క మాన‌దు. కాని సినిమా మాస్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా కాదు. ఒక పాత మాస్ కథను తీసుకుని కొత్త సీన్స్, ఇంట్రెస్టింగ్ కథనంతో స్టైలిష్‌గా తెరకెక్కించడం కొరటాల శివ స్టైల్. హీరోను కూడా చాలా స్టైలిష్‌గా ప్రజెంట్ చేశాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల విషయంలో ఇదే ఫార్మాట్ ఫాలో అయిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాను కూడా అదే స్టైల్‌లో తెరకెక్కించాడు. మరి ఈ సారి ఎన్టీఆర్ తో తీసిన సినిమా సక్సెస్ అయ్యిందా..? ఎన్టీఆర్, మోహన్‌లాల్‌ల యాక్టింగ్ ఎలా ఉంది? ఫైనల్‌గా సినిమా రిజల్ట్ ఏంటి?

సత్యం(మోహన్‌లాల్) అనే ఒక వ్యక్తికి ప‌క్క మ‌నిషి ఎవ‌రైనా కష్టాల్లో ఉన్నాడంటే ఆయ‌న కంటిమీద‌ నిద్ర ఉండ‌దు. ముద్ద దిగ‌దు. జనతా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్ నడుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తుంటాడు. కానీ ఆశయం మాత్రం కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికీ తోడుగా ఉండాలన్నదే. ప్రభుత్వం, పోలీస్ స్టేషన్స్, కోర్ట్‌లకంటే కూడా మనుషులందరూ న్యాయం కోసం జనతా గ్యారేజ్ కు వ‌స్తుంటారు. జనతా గ్యారేజ్‌ని ఆ స్థాయికి తీసుకుని వస్తాడు సత్యం. అయితే తనకు వయసు అయిపోవడం, వారసుడేమో జనతా గ్యారేజ్‌ బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో బాధపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో గ్యారేజ్‌కి ఆనంద్(ఎన్టీఆర్) అనే ఓ కుర్రాడు వస్తాడు. ముంబై వాసి అయిన ఆనంద్ ఓ ఎన్విరాన్‌మెంటల్ స్టూడెంట్. అలాంటి ఆనంద్‌కి జనతా గ్యారేజ్‌కి సంబంధం ఏంటి? సమంతా, నిత్యామీనన్‌లతో ఆనంద్ లవ్ స్టోరీ ఏంటి? ఆనంద్, సత్యంలు కలిసి జనతా గ్యారేజ్‌ని ఏ హైట్స్‌కి తీసుకెళ్ళారు? జనతా గ్యారేజ్‌ని నామరూపాల్లేకుండా చేయాలని చూసిన వాళ్ళను ఆనంద్, సత్యంలు ఎలా శిక్షించారు? సొసైటీని ఎలా కాపాడారు? అన్నది కథాంశం.

కొరటాల శివ రెండున్నర గంటలపాటు చెప్పగలిగిన మంచి కథ ఇందులో ఉంది. కానీ కొరటాల శివ మాత్రం కథ సరిపోదని ఫీల్ అయినట్టున్నాడు. అందుకే అనవసరమైన అనేక అంశాలను చొప్పించి కథనం బలహీనంగా తయారయ్యేలా చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అయితే అసలు కథకు అనవసరం కూడా. అలాగే కథనం మొత్తం కూడా ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ లేవు. అందుకే ఒకానొక సమయంలో ఆల్రెడీ చూసేసిన సినిమాను మళ్ళీ చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే మిర్చి, శ్రీమంతుడు సినిమాలలో అద్భుతమైన సీన్స్‌ రాసుకున్న కొరటాల శివ…ఈ సారి మాత్రం చాలా పేలవమైన సీన్స్ రాసుకున్నాడు. ప్రి ఇంటర్వెల్ టైంలో, పోస్ట్ ఇంటర్వెల్ టైంలో వచ్చే సీన్స్ పక్కన పెడితే చాలా సీన్స్ వీక్‌గా ఉన్నాయి. అలాగే సాంగ్స్ కూడా కావాలని ఇరికించినట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా టూర్‌కి వెళ్ళే సాంగ్ అయితే అసందర్భంగా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ విషయంలో కూడా తన బలహీనతలన్నీ మరోసారి బయట పెట్టుకున్నాడు కొరటాల శివ. భారీగా ఏదో చేసేద్దామన్న తాపత్రయంలో ముఖ్యమంత్రి మార్పు, బాంబ్ బ్లాస్ట్ లాంటి హెవీ క్లైమాక్స్ ప్లాన్ చేశాడు. అస్సలు లాజిక్ లేకుండా ఉండడం…. అది మరీ సిల్లీగా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విలన్ క్యారెక్టర్ సరిపోలేదు.

ఈ లోపాలను పక్కన పెడితే సినిమాలో చాలా ప్లస్సులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్‌లాల్‌లు పోటాపోటీగా నటించారు. మోహన్‌లాల్ కేవలం కళ్ళతోనే అనేక భావాలను అద్భుతంగా పలికించారు. ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటించాడు. జనతా గ్యారేజ్ కోసం ఓ విషయాన్ని త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, ‘నేనున్నానమ్మా…’అన్న డైలాగ్ చెప్పిన సీన్‌లో, ఫైట్స్, డ్యాన్స్‌ల విషయంలో ది బెస్ట్ చూపించాడు ఎన్టీఆర్. యాపిల్ బ్యూటీ, పక్కా లోకల్ సాంగ్స్‌లో అయితే ఎన్టీఆర్ డ్యాన్సులకు థియేటర్ దద్దరిల్లింది. నిత్యామీనన్‌, సమంతాలకు అంత స్కోప్ లేదు. ఉన్నంతలో నిత్యామీనన్ మాత్రం తన ప్రజెన్స్‌ని గుర్తించేలా చేయగలిగింది. సమంతా క్యారెక్టర్‌ని అటూ ఇటూ కాకుండా చేశారు. సమంతా కాస్ట్యూమ్స్, మేకప్ కూడా అస్సలు బాగాలేదు. కాజల్ మాత్రం స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది.  దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ చాలా బాగున్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా సార్లు ఓవర్ ది బోర్డ్ వెళ్ళాడు. ఫొటోగ్రఫి అదిరిపోయింది. ఎడిటింగ్ బాగాలేదు. డైలాగ్స్ బాగున్నాయి.

ఓవరాల్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్‌ని అందుకునే సత్తా అయితే జనతా గ్యారేజ్‌కి లేదు. సెకండ్ హాఫ్ ప్రేక్ష‌కుల‌కు పిచ్చిలేపుతుంది. దేనిక‌దే సంబందం లేని సీన్లు అర్థం కావు. ఎన్టీఆర్ అప్డేట్ కావ‌టం లేదు. పాత‌స్టెప్పులు, పాత హావాబావాలు అలాగే క‌నిపిస్తున్నాయి. స్టార్‌డం, హీరోయిజం బిల్డప్స్ లాంటి హంగామా కాకుండా జనతా గ్యారేజ్ కథను చెప్పాలన్న కొరటాల శివ ప్రయత్నం మామూలు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

రేటింగ్ః 2.5/5

చ‌మ‌క్కు :  ఎన్టీఆర్‌, రొర‌టాల సినిమాకు మాత్ర‌మే వెళ్ళాల‌నుకునే వాళ్ళు దూరంగా ఉండ‌టం మంచిది. ఏదో ఒక సినిమా చూద్దాం అనుకుంటే ప‌ర‌వాలేదు. 

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.