జయసుధకు అంతిచ్చారా...

సినిమా పిల్లర్- సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలున్నప్పటికీ దూసుకువస్తున్నాడు విప్లవ సినిమాల హీరో ఆర్ నారాయణమూర్తి. చదలవాడ శ్రీనివాసరావు మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. సిన్సియర్ కానిస్టేబుల్ గా నారాయణమూర్తి నటిస్తున్న ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సంక్రాతి పోటీలో సినిమా హాల్స్ కొరత తీవ్రంగా ఉన్నా రామోజీరావు కి చెందిన మయూరి ఫిలిమ్స్ సహకారంతో విడుదలకు మార్గం సుగమం చేసుకున్న నారాయణమూర్తికి ఇంకా టెన్షన్ పూర్తిగా తగ్గలేదు. భీముడు తర్వాత బయటి బ్యానర్ లో నారాయణమూర్తి నటిస్తున్న సినిమా ఇదే. ఇక ఇందులో నారాయణమూర్తి సరసన జయసుధ నటించడం విశేషం. చిన్నగా భామ్మ పాత్రలకు షిఫ్ట్ అయిన జయసుధ మధ్య వయసు పాత్ర అందులోనూ మూర్తి పక్కన నటించడం ఆసక్తిరేపుతోంది. ఇక ఈ సినిమాలో నటించిన జయసుధకు అక్షరాల 70లక్షలు సమర్పించుకున్నారని సమాచారం. మార్కెట్ లేని ఇలాంటి సినిమాలో జయసుధ లాంటి ఆర్టిస్ట్ ఉంటె ఆటోమేటిక్ గా వేల్యూ యాడ్ అవుతుందని గుర్తించిన నిర్మాత అంత ఇవ్వడానికి ఒక అనేసాడట. అందుకే ఇందులో చిలిపి రొమాంటిక్ డ్యూయెట్లు పెట్టినట్టు పోస్టర్ల ద్వారా అర్థమైంది. పైగా ఆవిడ బుగ్గ మీద సుతిమెత్తగా కొట్టడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆర్ నారాయణ మూర్తి చెప్పిన సంగతి తెలిసిందే.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.