అలా చేయించుకుంటే తప్పేంటీ..

సినిమా పిల్లర్-  హీరోయిన్లు అందంగా కనిపించేందుకు ఆపరేషన్స్ చేయించుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే అందంగా కనిపించడం కోసం ఆపరేషన్స్ చేయించుకున్న వారిని కొంతమంది చిన్న చూపు చూస్తారు. అందాల భామ కాజల్ మాత్రం అందం కోసం ఆపరేషన్ చేయించుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది. అందంగా కనిపించాలని ఆపరేషన్స్ చేసుకోవడం మాములే అని, అది ఏమాత్రం తప్పుకాదని ఈ అమ్మడు చెబుతోంది. 

అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే అందం పెంచుకోవడానికి ఆపరేషన్స్ కూడా అటువంటివే అంటోంది కాజల్. అయితే తానూ మాత్రం అందంగా కనిపించడం కోసం ఇప్పటివరకు ఒక్క ఆపరేషన్ కూడా చేయించుకోలేదని చెప్పింది. వయసు పైపడ్డ తర్వాత చర్మం ముడతలు పోగొట్టుకునేందుకు తాను ఎలాంటి చికిత్స తీసుకొను అని చెప్పుకొచ్చిందీ ఈ చందమామ. వయసుతో వచ్చే ప్రతిదాన్ని తానూ ఆనందంగా స్వీకరిస్తానని అంటోంది. 

 

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.