నేను అదే.. కాని చెప్పలేను..

సినిమా పిల్లర్- బాలివుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అందరు హీరోయిన్లతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతాడు కాని, ఎవరితోనూ ప్రేమాయణం నడపలేదు. కనీసం ఎఫైర్ కూడా పెట్టుకోలేదు. అందుకే కరణ్ జోహర్ స్వలింగ సంపర్కుడనే ప్రచారం జరిగింది. కాని ఆ దర్శకుడు ఎప్పుడూ ఈ విషయంపై స్పందించతలేదు.  భారతదేశంలో ఉన్న హోమోఫోబియా (స్వలింగ సంపర్కుల పట్ల అయిష్టత) గురించి మాట్లాడిన కరణ్ జోహార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓ స్వలింగ సంపర్కుడినని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకున్నాడు కరణ్.

నా సెక్సువల్ ఓరియెంటేషన్ ఏంటో అందరికి తెలుసు. నేను దాన్ని (గే అనే విషయాన్ని) అరుస్తూ బయటపెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలనుకున్నా, నేను చెప్పలేను. ఎందుకంటే నేను బ్రతుకుతున్న దేశంలో ఆ మాటలకి నన్ను జైలులో పెట్టినా పెడతారు. అందుకే నా గురించి అందరికి తెలిసిన విషయాన్ని కూడా నేను నా నోటితో బయటపెట్టలేను. ఈ హోమోఫోబియా అనేది హృదయానికి బాధను కలిగిస్తుంది” అంటూ చెప్పాల్సిన అసలు విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పేశాడు కరణ్ జోహర్..

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.