నిర్మలా కాన్వెంట్ సినిమా రివ్యూ..

సినిమా పిల్లర్- హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. నాగార్జున, నాగార్జున నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమా రివ్యూ ఎక్స్ క్లూజివ్ ఫర్ న్యూస్ పిల్లర్...

సినిమా- నిర్మలా కాన్వెంట్

తారాగణం - నాగార్జున.. రోషన్‌.. శ్రియా శర్మ.. ఎల్బీ శ్రీరామ్‌.. సూర్య.

నిర్మాణ సంస్థ- అన్నపూర్ణ 

సంగీతం- రోషన్‌ సాలూరి 

నిర్మాతలు- నాగార్జున.. నిమ్మగడ్డ ప్రసాద్‌ 

దర్శకత్వం- జి.నాగేశ్వరరెడ్డి

హీరో శ్రీకాంత్‌ తనయుడు కథానాయకుడిగా మారడం.. నాగార్జున ఓ కీలకపాత్ర పోషించడం ఇవన్నీ నిర్మలా కాన్వెంట్ పై అందరికి ఆసక్తి పెంచుతోంది. ‘నిర్మలా కాన్వెంట్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ దానికి తోడైంది. ఈ మధ్య ప్రేమ కథలు విజయవంతమై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ‘నిర్మలా...’ పై దృష్టి మళ్లింది. 

కథ- శామ్యుల్‌ (రోషన్‌) తెలివైనఅబ్బాయి. నిర్మలా కాన్వెంట్‌ స్టూడెంట్‌. చదువులో ఫస్ట్‌. ఎప్పుడూ పుస్తకాలే లోకం. ప్రతీ విషయాన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడం అతనికి అలవాటు. అదే కాన్వెంట్‌ లో శామ్యూల్‌ తో పాటు చదువుతుంటుంది శాంతి (శ్రియ శర్మ). ఆ కాన్వెంట్‌ లో అబ్బాయిలంతా శాంతి వైపు పడుతుంటే... తను మాత్రం శామ్యూల్‌ ని ఇష్టపడుతుంది. అతన్ని కవ్విస్తుంది. శామ్యూల్‌ కూడా శాంతిని ఇష్టపడతాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా రెండు కుటుంబాల మధ్య ఆస్తుల అంతరం చాలా ఉంటుంది. దానికి తోడు తాతల కాలం నాటి గొడవలు. దాంతో శాంతి నాన్న (ఆదిత్య మేనన్‌) శామ్యూల్‌ ని మనుషుల్ని పెట్టి కొట్టిస్తాడు. శామ్యూల్‌  పొలాన్ని కూడా లాక్కుంటాడు. ‘నువ్వు నా కంటే ఎక్కువ సంపాదించు, నాకంటే ఎక్కువ కీర్తి గడించు. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా’ అంటాడు. దాంతో డబ్బు సంపాదించడం కోసం శామ్యూల్‌ హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ సినిమా హీరో నాగార్జున (నాగార్జున)ని కలుస్తాడు. ఆ తరవాత ఏమైంది అనేదే ఈ చిత్ర కథ.

కధనం- ప్రధమార్థం కొత్తగా అనిపించదు. శామ్యూల్‌ తన తెలివితేటల్ని ప్రదర్శించే సన్నివేశాలు మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది. బీ పాజిటీవ్‌ రక్తాన్ని ఓ నెగిటీవ్‌ గా మార్చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. కథానాయిక తండ్రి విసిరిన ఛాలెంజ్‌ కోసం కోట్లు  సంపాదించడానికి ఓ పదహారేళ్ల కుర్రాడు సిటీకి బయల్దేరటం.. దాన్ని సాధించడం సినిమాటిక్‌ గా అనిపిస్తాయి. తొలి భాగంలో స్నేహితుల మధ్య కొన్ని సరదా సన్నివేశాలు రాసుకోవాల్సింది.

ఇక ద్వితీయార్థంలో నాగార్జున ఎంట్రీ ఇస్తారు. ఆయన చేసిన  టీవీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను మళ్లీ చూపించారు. ఆ షో తాలుకూ సీన్లన్నీ ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’  సినిమా నుంచి ప్రేరణగా పొంది రాసుకున్నవిగా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు అందరూ వూ­హించిన విధంగానే మామూలుగా సాగాయి.

నటీనటుల ప్రతిభ :  రోషన్‌.. శ్రియల జంట చూడముచ్చటగా ఉంది. రోషన్‌ కి ఇదే తొలి సినిమా అంటే నమ్మబుద్ది కాదు. అందంగా ఉన్నాడు.. ఆకట్టుకొన్నాడు. శ్రియ  ఎక్స్ ప్రెషన్స్ ముద్దుముద్దుగా ఉన్నాయి. చాలా చోట్ల శ్వేతాబసు ప్రసాద్ లా అనిపించింది. ఈ సినిమా కోసం నాగార్జున పడిన తపన కనిపిస్తుంది. ఇక.. ఎల్బీ శ్రీరాం కనిపించింది కాసేపే అయినా అందులో ఆయన నటన.. సంభాషణలు బాగున్నాయి. 

సినిమా పిల్లర్ రేటింగ్- 4/10

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.