గౌతమీపుత్ర అజరామరం- రాజమౌళి

సినిమా పిల్లర్- నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై దర్శకుడు రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించాడు. సినిమా అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని అన్నాడు. దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని అన్నాడు రాజమౌళి. రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.