అయ్యో స‌ర్కారు బ‌డిలో విద్యాప్ర‌మాణాలు చూశారా..?

మహబూబ్‌నగర్ : అక్క‌డ ఐదో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు క‌నీసం వారి త‌ల్లిదండ్రుల పేర్లుకూడా రాయ‌లేక‌పోతున్నారు. ఇది స‌ర్కారు బ‌డుల్లో విద్యాప్ర‌మాణాల‌కు అద్దం ప‌డుతుంది. ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు వ‌చ్చిన విద్యార్థుల‌కు పేర్లు కూడా రాయ‌లేనంత దుస్థితా .. అవును మీరు వింటున్న‌ది నిజ‌మే . ఇంత‌కీ ఈ స‌ర్కారు బ‌డి ఎక్క‌డ .. వివ‌రాల్లోకి వెళ్ళితే ..

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ రొనాల్డ్ రోస్ జిల్లా ప‌రిధిలోని రెండు మండ‌లాల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను అక‌స్మిక త‌నిఖీలు చేశారు. మిడ్జిల్‌ మండలం వల్లభరావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్ళిన క‌లెక్ట‌ర్  కాసేపు విద్యార్థులతో ముచ్చటించి టీచ‌ర్లు పాఠాలు ఎలా చెబుతున్నారంటూ అడిగారు. ఈ సంద‌ర్బంలో విద్యార్థుల్లో విద్యాప్ర‌మాణాలు చూసి నివ్వెర‌పోయారు. విద్యార్థులు క‌నీసం వారి త‌ల్లిదండ్రుల పేర్లు కూడా రాయ‌లేనంత స్థితిలో ఉండ‌టం చూసి టీచ‌ర్ల‌పై మండిప‌డ్డారు.

మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించ‌గా  .. త‌మ పిల్ల‌లు కార్పోరేట్‌ స్కూల్ లో చదువుతున్నారని సమాధానం చెప్పారు టీచ‌ర్లు . ఇక్కడి పిల్లలకు పేర్లు కూడా రాయడం రాదు .. మీ పిల్లలను మాత్రం కార్పోరేట్‌ పాఠశాలల్లో చదివిస్తారా ..? ఇదేనా పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించని వారిని ఎందుకు ఉపేక్షించాలంటూ సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాశ్ తో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని మండల విద్యాధికారి పద్మకు ఆదేశాలు జారీచేశారు.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.