AP to TS నంబ‌ర్ ప్లేట్ మార్పుకు మార్గ‌ద‌ర్శ‌కాలు

హైద‌రాబాద్ః రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి తెలంగాణ  ఏర్పాటు అయ్యాక వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్ లు మార్చుకోవాల‌ని అప్ప‌ట్లో తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశించింది.  అయితే ఇప్పుడు నంబ‌ర్ ప్లేట్ చేసేందుకు క‌స‌ర‌త్తు తీవ్ర త‌రం చేసింది. న‌బ‌ర్ మొత్తం మార్చ‌కుండా ఏపీ స్థానంలో టీఎస్ .. జిల్లా కోడ్ మార్చుకుంటే స‌రిపోతుంద‌ని ర‌వాణా శాఖ అదికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. పాత నంబ‌ర్ ను లాగా కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు నెంబ‌రు మార్చుకోని 75ల‌క్ష‌ల మోటారిస్టుల‌ను ప్ర‌భుత్వం గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ రిజిస్ట్రేష‌న్ క‌లిగి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వాహ‌నాల‌ను న‌డుపుతున్న వారి సంఖ్య ల‌క్ష‌కుపైగా ఉన్న‌ట్లు ర‌వాణా శాఖ వివ‌రించింది.  మ‌ళ్లీ కొత్త నెంబ‌రు మార్చుకోవాలంటే టూవీల‌ర్ వెహిక‌ల్స్‌కు రూ.350 ఖ‌ర్చు అవుతుండ‌గా ఫోర్ వీల‌ర్ వెహిక‌ల్స్‌కు రూ.550 ఖ‌ర్చు అవుతోంది. కొత్త హైసెక్యూరిటీ నెంబ‌ర్ ప్లేటు మార్చుకోవాలంటే టూవీల‌ర్ వెహిక‌ల్స్‌కు రూ.245 అవుతుండ‌గా …రూ.619 ర‌వాణా శాఖ వ‌సూలు చేస్తోంద‌న్నారు. అయితే ఈ ఖ‌ర్చు ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

 

జిల్లాల వారీగా  కోడ్లు

ఆదిలాబాద్ – TS 01

క‌రీంన‌గ‌ర్ – TS 02

వ‌రంగ‌ల్ – TS 03

ఖ‌మ్మం – TS 04

న‌ల్గొండ – TS 05

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – TS 06

రంగారెడ్డి – TS 07 TS 08

హైద‌రాబాద్ – TS 09, TS 10, TS 11,TS 12, TS 13, TS 14

మెద‌క్ – TS 15

నిజామాబాద్ – TS 16

కామారెడ్డి – TS 17

నిర్మ‌ల్ – TS 18

మంచిర్యాల – TS 19

కుమ్రం భీమ్ – TS 20

జ‌గిత్యాల – TS 21

పెద్ద ప‌ల్లి – TS 22

రాజ‌న్న సిరిసిల్ల – TS 23

వ‌రంగ‌ల్ రూర‌ల్ – TS 24

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి – TS 25

మ‌హ‌బూబాబాద్ – TS 26

జ‌న‌గాం – TS 27

భ‌ద్రాద్రి – TS 28

సూర్యాపేట – TS 29

యాదాద్రి – TS 30

నాగ‌ర్ కర్నూలు – TS 31

వ‌న‌ప‌ర్తి – TS 32

జోగులాంబ గ‌ద్వాల్ – TS 33

వికారాబాద్ – TS 34

మెదక్ – TS 35

సిద్దిపేట్ – TS 36

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.