ఆయన నిర్మాణంలో ఈయన సినిమానా..

సినిమా పిల్లర్- కొలీవుడ్ లో ఇద్దురు పెద్ద హీరోలకు సంబందించిన ఓ సినిమా ప్రాజెక్టుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ నటుడు  విజయ్, సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడు ధనుష్‌ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. విజయ్‌ ఇటీవలే భైరవా చిత్రాన్ని పూర్తి చేశాడు.  ఈ సినిమా నెల 12వ తేదీన విడుదలవుతోంది. తదుపరి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు విజయ్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు తేరి వంటి సూపర్‌ హిట్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తరువాత విజయ్‌ ఏఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందనుందనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. 

ఇక వీరిద్దరి కలయికలోనూ తుపాకీ, కత్తి వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఇంతకు ముందు విజయ్‌ నటించిన కత్తి చిత్రాన్ని ధనుష్‌ నిర్మించాల్సిందట. అది కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా వేరే చేయి మారిందట. దీంతో విజయ్‌ 62వ చిత్రాన్ని ధనుష్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తోంటే ధనుష్‌ స్టార్‌ హీరోలపై కన్నేసినట్లుతెలుస్తోంది. ఇప్పటికే తన వుండర్‌ బార్‌ ఫిలింస్‌ పతాకంపై తన మామ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా కబాలి–2 చిత్రాన్ని పా.రంజిత్‌ దర్శకత్వంలో నిర్మించనున్నారట. ఆ తరువాత విజయ్‌ తో చిత్రం చేసే అవకాశం ఉన్నట్లు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.