News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

స్కూటర్ టైర్ పంక్చర్ చేసింది ఆ నీచులే.. పథకం ప్రకారమే అత్యాచారం , హత్య..

ఈ నీచులే డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు.. చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ కుమార్‌. వీళ్ళు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామస్తులు. వీరిలో చెన్నకేశవులు ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు . గుడిగండ్ల గ్రామంలో 60 మంది వరకు లారీల మీద పనిచేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో లారీ నంబర్‌ ఆధారంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్‌ పాషాది గుడిగండ్ల పక్క గ్రామమైన జక్లేర్‌. అతడి దగ్గర చెన్నకేశవులు, శివ, నవీన్‌ పనిచేస్తున్నారు. ప్రియాంక రెడ్డి ప్రతిరోజూ ఇంటినుంచి స్కూటీపై టోల్ ప్లాజా వరకు వెళ్లి, అక్కడ స్కూటీ ఉంచి, అక్కడినుంచి బస్సులో తను పనిచేసే కొల్లాపూర్ వెళ్తుంది. తిరిగి బస్సులో వచ్చి స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్తుంది.

- Advertisement -

ఇదే ఈ కిరాతకులు అవకాశంగా భావించి, ఆమె తిరిగొచ్చే లోగా స్కూటీ టైర్ పంచర్ చేశారు. ఆమెను తమ ట్రాప్ లో వేసుకున్నారు. ఈ నలుగురు ప్రియాంక స్కూటర్‌ టైర్‌ను పథకం ప్రకారం పంక్చర్‌ చేసి తర్వాత ఆమెను ట్రాప్‌ చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.