News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాశ్మీర్ లో మోదీ నిర్బంధ పాల‌న ..!

జ‌మ్మూ కాశ్మీర్ : కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల బృందంతో క‌లిసి వెళ్లిన రాహుల్ గాందీని అక్క‌డి పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్  ప్ర‌తినిధి బృందాన్ని అక్కడి ప్రభుత్వ యంత్రాగం అడ్డుకుని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ వద్దే గంటసేపు నిలిపేసింది. అనంత‌రం వారిని వెనక్కి పంపించింది. దీనిపై రాహుల్ సహా ప్రతినిధి బృందం నేతలు ఘాటు స్పందించారు.

rahul

- Advertisement -

గవర్నర్ ఆహ్వానం మేర‌కే తాను కాశ్మీర్ కు వ‌చ్చాన‌న్న రాహుల్ గాంధీ ..  పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు వివిధ పార్టీల సీనియర్ నేతలకు కూడా తీసుకువచ్చానన్నారు. అయితే మమ్మల్ని విమానాశ్రయం దాటి వెళ్లనీయ కుండా ఆంక్ష‌లు విధించ‌డం ఇక్క‌డి ప‌రిస్థితికి అద్దం ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. మీడియా పట్ల పోలీసుల తీరుపై కూడా రాహుల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు, కాశ్మీర్ పోలీసులు స‌క్రమ రీతిలో వ్యవహరించడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని చెప్ప‌డానికి ఈ ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని రాహుల్ అన్నారు.

rahul

Leave A Reply

Your email address will not be published.