News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మోడీజీ.. మీ మ్యాజిక‌ల్ యోగాను పెంచండి.. కేంద్ర బ‌డ్జెట్ పై రాహుల్ సెటైర్..

ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జె్ట్ పై రాహుల్ గాంది త‌న‌దైన శైలిలో సెటైర్ సందించారు. బడ్జెట్‌లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని, అస‌లు ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని తెలిసి పోయింద‌ని.. త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో కేంద్రాన్ని ఏకి పారేసిన రాహుల్.. ప్రధాని మోడి టార్గెట్ గా.. ట్విట్ట‌ర్లో పెట్టిన‌ సెటైర్ ఇప్పుడు సోష‌ల్ మిడియాలో వైర‌ల్ అయ్యింది.

- Advertisement -

గ‌తంలో మోడి యోగా చేస్తూ.. విడుద‌ల చేసిన ఓ వీడియోను జత చేస్తూ… దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను లింక్ పెట్టి మోడీకి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు రాహుల్. క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోదీ రోజువారీ యోగాభ్యాసాన్ని పెంచితే బాగుంటుందేమో చూడాలన్నారు. ప్రియతమ ప్రధాన మంత్రి గారూ, దయచేసి మీ రోజువారీ మాయాజాల వ్యాయామాలు (మ్యాజికల్ ఎక్సర్‌సైజెస్‌)ను మరి కాస్త పెంచండి. మీకు తెలియదు, అవి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరచవచ్చని రాహుల్ ట్వీట్ తో సెటైర్ విసిరారు.

Leave A Reply

Your email address will not be published.