News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎవడు సింపతీ కొడితే వాడే బిగ్‌బాస్‌!

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌బ్లాక్‌ అవుద్దో వాడే మాస్‌ హీరో. ఇది సినిమాల్లోని హీరోయిజం. కానీ బిగ్‌బాస్‌ షోలో ఎవడు కొడితే వాడు విలన్‌ అయిపోతాడు, ఎవడు టార్గెట్‌ అవుతాడో వాడు సింపతీ కొట్టేస్తాడు. గత సీజన్‌లో ఆడియన్స్‌ సింపతీ లెవల్స్‌ ఏ స్థాయిలో వుంటాయనేది క్రిస్టల్‌ క్లియర్‌గా తెలిసింది. ఈ సీజన్‌లోను ఆ లెవల్‌కి కాకపోయినా రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా సింపతీ వల్లే గెలిచాడు.

ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ల మీద అక్కసు వెళ్లగక్కకుండా, సైలెంట్‌గా టార్గెట్‌ చేయాలి. కానీ శ్రీముఖి మాత్రం రాహుల్‌ విషయంలో తన స్ట్రాటజీ మిస్‌ అయింది. అతడిని రాంగ్‌గా చూపిస్తే జనం హేట్‌ చేస్తారని పొరబడింది. రాహుల్‌ని ఆమె తప్పుగా చూపించే కొద్దీ అతనితో ఆడియన్స్‌ కనక్ట్‌ అవుతూ వచ్చారు. రాహుల్‌కి అంత సింపతీ వర్కవుట్‌ అవుతుందనేది కూడా సైలెంట్‌గానే అర్థమయింది.

- Advertisement -

ప్రతివారం నామినేషన్లలో పెట్టే కొద్దీ అతని ఫాన్‌ బేస్‌ స్ట్రాంగ్‌ అవుతూ వచ్చింది. నాలుగైదు వారాల వరకు రాహుల్‌ అసలు సోదిలో కూడా లేడు కానీ ఆ తర్వాత మాత్రం అతని వెంట ఎవరుంటే వాళ్లంతా సేఫ్‌ అయ్యే లెవల్‌కి ఎదిగిపోయాడు. అతని వల్ల వరుణ్‌ ఫాలోయింగ్‌ పెరగడమే కాకుండా పునర్నవి కూడా ఎక్కువ రోజులు వుండగలిగింది. ఈ రెండు సీజన్లతో సెలబ్రిటీలకి ఒక విషయం బోధపడి వుండాలి. పబ్లిక్‌కి అండర్‌డాగ్‌ని హీరోని చేయడం ఇష్టం. సెలబ్రిటీల్లో వారు తమని తాము ఐడెంటిఫై చేసుకోరు.

సెలబ్రిటీలపై సామాన్యులని గెలిపించి వాళ్లని హీరోని చేస్తుంటారు. ఇక మీదట బిగ్‌బాస్‌ షోకి ఎంటర్‌ అయ్యే సెలబ్రిటీలు అంతా ఈ విషయాన్ని గుర్తుంచుకుని సింపతీ ఓట్‌ ఎవరివైపు మొగ్గకుంటే చూసుకుంటే గెలుపు అవకాశాలని మెరుగు పరచుకుంటారు.
TAGS: Rahul sipligang, Sreemukhi, Bigg Boss3, Bigg Boss 3 Telugu, Nagarjuna, winner

Leave A Reply

Your email address will not be published.