News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పవన్‌ అభిమానులు పరిణతి చూపిస్తున్నారు

ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ తీరు మరీ విడ్డూరంగా తయారవుతోంది. ఎవరినైనా ఒకసారి టార్గెట్ చేస్తే అదే పనిగా గిచ్చడం వర్మకు అలవాటు. ఆయనకు మెగా ఫ్యామిలీ టార్గెట్ అన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వర్మకు ఎందుకంత మంట అన్నది జనాలకు అర్థం కాదు. శ్రీరెడ్డితో బూతు తిట్టించడం మొదలుకుని చాలా సార్లు పవన్‌ను వర్మ టార్గెట్ చేయడం తెలిసిందే. ఐతే ఇప్పుడు పవన్‌పై తన దాడిని మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు వర్మ.

తన కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పోస్టర్లు, స్టిల్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పవన్ వేదిక మీద మాట్లాడుతున్న స్టిల్ వదిలి అందులో చుట్టూ డ్యాన్సర్లను పెట్టడం.. మరో స్టిల్‌లో నారా లోకేష్‌తో పవన్ సమాలోచనలు జరుపుతున్నట్లు చూపించడం వెనుక ఉద్దేశాలేంటన్నది స్పష్టం.

సరిగ్గా పవన్ కళ్యాణ్.. ఏపీలో ఇసుక సంక్షోభానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన సమయంలోనే వర్మ ఇలాంటి పోస్టర్లు వదిలి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం. దీంతో ఏపీ అధికారక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లెవరైనా వర్మ వెనుక ఉన్నారేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఐతే ఈ సమయంలో వర్మ కోరుకునేది పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన. వాళ్లు ఎంతగా తనను తిట్టిపోస్తే.. తాను రిలీజ్ చేసిన పోస్టర్ల మీద రచ్చ చేస్తే సినిమాకు అంత పబ్లిసిటీ అనేది వర్మ ఉద్దేశం.

- Advertisement -

ఎప్పుడూ ఇలాంటి పబ్లిసిటీతోనే తన సినిమాల్ని మార్కెట్ చేసుకోవడం వర్మకు అలవాటు. ఐతే గత కొన్నేళ్లలో వర్మ పూర్తిగా విలువ కోల్పోయిన నేపథ్యంలో ఆయన్ని జనాలు పట్టించుకోవడం మానేస్తున్నారు. వర్మను ఇగ్నోర్ చేయడమే ఆయనకు పెద్ద శిక్ష అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు. మామూలుగా ఆవేశపడిపోయే పవన్ అభిమానులు కూడా ఈ సమయంలో పరిణతి ప్రదర్శిస్తుండటం, వర్మను లైట్ తీసుకుని సంయమనం పాటిస్తుండటం విశేషం.

Tags: Again rgv, targeted, pawankalyan, latest movie, kammarajyam, kadapa redlu

 

Leave A Reply

Your email address will not be published.