News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రజలు ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టడం ఖాయ0: రేవంత్ రెడ్డి

  • భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ..
  • అడుగడుగునా పోలీస్ నిర్బంధం ..
  • కాంగ్రెస్ శ్రేణులతో నిండిన జైళ్లు ..
  • పోలీసులకు చుక్కలు చూపించిన రేవంత్ ..
  • పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ ముట్టడి ..
  • ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టడతాం : రేవంత్
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ..

హైదరాబాద్ : కేసీఆర్ నియంతృత్వ ధోరణి వీడకపోతే .. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో ప్రగతి భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చలో ప్రగతి భవన్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ఎక్కడి అక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొందరు ముఖ్యనేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. అయితే కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం పోలీసులను చుక్కలు చూపించారు. ఆయన్ని హౌస్‌ అరెస్ట్‌ చేయాలని పోలీస్ లు ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కానీ ఆయన ఇంట్లో ఉన్నాడో లేడో తెలుసుకోలేక పోయారు.

chalo pragathi bhavan congress party

- Advertisement -

రేవంత్ రెడ్డి ఇంట్లో లేరని పోలీసులు .. ఆయన సన్నిహితుల ఇళ్లలో .. స్నేహితుల ఇళ్లలో .. బంధువుల ఇళ్లలో విస్తృతంగా ఆయన కోసం వేదికారు. రేవంత్ రెడ్డి కోసం పోలీసుల వేట నిన్న రాత్రి నుంచే సాగింది ఇంట్లో లేరని రేవంత్ రెడ్డి కోసం ప్రగతి భవన్ చుట్టూ ఉన్న అన్ని హోటల్స్ ను పోలీసులు చెక్ చేశారు. కానీ ఎక్కడున్నారనేది తెలుసుకోలేక పోయారు. పోలీస్ లు రేవంత్ కోసం వెతుకుతున్న సమయంలో .. ఒక్కసారిగా తన ఇంట్లో నుంచి బయటికి వచ్చి అక్కడే ఆగివున్న బైక్ పై ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీస్ లు తెరుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌ వద్దకు చేరుకున్నారు. బైక్‌ పై దూసుకొచ్చిన రేవంత్‌ ను ప్రగతి భవన్‌ గేటు వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. దీంతో ప్రగతిభవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

chalo pragathi bhavan congress party

ఈ సందర్భంగా ప్రగతి భవన్ ముందు మీడియాతో మాట్లాఫైన రేవంత్‌ రెడ్డి .. ప్రగతి భవన్‌ గేట్లను తాకుతామని అన్నామని.. తాకి చూపించామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రేవంత్ అరెస్ట్ తరువాత పోలీసులు ఉపిటి పీల్చుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ లు సాగించారు.

Leave A Reply

Your email address will not be published.