News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తుమ్మిడిహెట్టి వద్ద ఎందుకు బ్యారేకీ నిర్మాణం చెయ్యలేదో సమాధానం చెప్పు ..

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. నిన్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభలో కేటీఆర్​ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు పొన్నం ధీటుగా స్పందించారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని .. ఎందుకు నిర్మించలేదో ముందు ప్రజలకు సమాదానం చెప్పాలని నిలదీశారు. సమస్యను చెపితే వినే ఓపిక లేకుండా … కాంగ్రెస్ పై విమర్శలు చేయడం దారుణమని దుయ్యబట్టారు.

Ponnam prabhakar

కాంగ్రెస్ నాయకులు తుమ్మడిహెట్టి పర్యటనకు వెళితే .. విహారయాత్రకు వెళ్లారని అంటున్న కేటీఆర్‌ … సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే కాంగ్రెస్ ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ముందు హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని పొన్నం ప్రశ్నించారు.

- Advertisement -

Ponnam prabhakar

మాజీ ఎంపీ వినోద్ పార్లమెంట్‌ లో ఉన్నప్పుడు రైతుల కోసం ఏమి చేశారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాజకీయ పునరావాసం కోసమే వినోద్‌ కుమార్‌ కు కేసీఆర్ .. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని పొన్నం ఎద్దేవా చేశారు.

Tags: PONNAM PRABHAKAR,KTR,KCR, PONNAM, CONGRESS,EX MP PONNAM PRABHAKAR, TELANGANA, TELANGANA GOVERNMENT,GREATER HYDERABAD ELECTIONS,KTR CAMPAIGN GEATER ELECTIONS,PONNAM FIRE ON KTR, GANDHIBHAVAN,UTTAM KUMAR REDDY, REVANTH REDDY, BHARTI VIKRAMARKA,JANAREDDY, JEEVANREDDY,CONGRESS THUMMIDIHETTI TOUR

Leave A Reply

Your email address will not be published.