News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బహిరంగ లేఖ సంధించిన రేవంత్ రెడ్డి ..!

తెలంగాణ‌ను కొత్త గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చిన త‌మిళిసై వ‌చ్చి రాగానే పొలిటిక‌ల్ హీట్ రాజేశారు. గ‌వ‌ర్న‌ర్ గా బాద్య‌త‌లు చేప‌ట్టిన ఇర‌వైనాలుగు గంట‌లు గ‌డ‌వ‌క ముందే .. ఆమె రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల మీద .. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పైనా పొగ‌డ్త‌లు కురిపించారు. కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శ‌మ‌ని .. కాళేశ్వ‌రం మ‌హాఅద్బ‌త‌మ‌ని త‌మిళ‌సై కామెంట్స్ చేశారు. స‌రిగ్గా ఈ వాఖ్య‌లే ఇప్పుడు పొలిటిక‌ల్ హీట్ రాజేశాయి. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వాఖ్య‌ల‌ను కాంగ్రెస్ సీరియ‌స్ గా తీసుకుంది. గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ .. ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ సంధించారు. బీజేపీ-టీఆర్ఎస్ ల మ‌ద్య న‌డుస్తున్న‌ది ఉత్తుత్తి ఫైట్ అని తాము చెబుతున్న మాట‌ల‌కు .. గ‌వ‌ర్న‌ర్ తాజా వాఖ్య‌లు అద్ధం ప‌డుతున్నాయ‌ని ఆయ‌న ఫైర్ అవుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు  త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలుగా ఉన్న త‌మిళిసై .. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చి రాగానే కేసీఆర్ స‌ర్కారును నెత్తికెత్తుకోవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌నే అంశాల‌ను రేవంత్ లేవ‌నెత్తుతున్నాడు.

Revanth

రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి పాల్ప‌డుతున్నాడ‌ని .. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ఉంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌లు .. గ‌వ‌ర్న‌ర్ వాఖ్య‌ల‌పై ఎందుకు మౌనంగా ఉన్నార‌ని కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తోంది. ల‌క్ష్మ‌ణ్ ఇచ్చిన స‌మాచారంతోనే గ‌వ‌ర్న‌ర్ మాట్లాడారా అని నిదీస్తున్న హ‌స్తం పార్టీ ముఖ్య‌నేత‌లు .. అది నిజం కాకుంటే .. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ కేసీఆర్ అవినీతికి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని కేంద్రానికి పిర్యాదు చేసేవార‌ని చెబుతున్నారు.

Revanth

- Advertisement -

రాష్ట్రంలో బీజేపీ-టీఆర్ఎస్ ల మ‌ద్య న‌డుస్తున్న పొలిటిక‌ల్ వార్ .. డూప్ ఫైట్ అంటూ ద్వ‌జ‌మెత్తుతున్న కాంగ్రెస్ .. గ‌వ‌ర్న‌ర్ వాఖ్య‌ల‌ను .. రాష్ట్ర బీజేపీకి లింకు చేస్తూ .. క‌మ‌లం నేత‌ల‌ను కార్న‌ర్ చేస్తున్నారు .

Revanth

Tags: REVANTH REDDY, TELANGANA GOVERNMENT, TELANGANA NEW GOVERNOR,TAMILISAI,KCR,LAXMAN, KISHANREDDY, NARENDRA MODI, AMITH SHA,UTTAM KUMAR REDDY, GANDHIBHAVAN,BJP OFFICE,TRS OFFICE, REVANTH REDDY WRITE A LETTER

Leave A Reply

Your email address will not be published.