News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: ఉత్తమ్

కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక బస్ డిపో సమీపంలో వాగేశ్వరి స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. బస్సు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

School Bus Accident

స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం తనను కలచివేసిందని ఆయన అన్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

School Bus Accident

- Advertisement -

విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆదుకోవాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని ప్రకటించారు.

School Bus Accident

Tags: School Bus Accident,Vemulawada School Bus Accident, Uttam Kumar Reddy,KTR,Etela Rajeendar, Karimnagar,Sirisilla, Gandhibhavan,Tpcc

Leave A Reply

Your email address will not be published.