News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సింధు కోచ్ గా సోనూసూద్

ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పివి సింధు బయోపిక్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా నిర్మాణ హక్కులను ప్రముఖ నటుడు సోనూసూద్ దక్కించుకున్నాడు. మొన్న పీవీ సింధుని కలసిన సోనూ సూద్ సినిమాకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొని త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో పీవీ సింధు పాత్రకోసం అక్కినేని కోడలు.. ప్రముఖ నటి సమంతను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాత్రలో స్వయంగా తానే నటించాలని నిర్ణప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పివి సింధు బయోపిక్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా నిర్మాణ హక్కులను ప్రముఖ నటుడు సోనూసూద్ దక్కించుకున్నాడుయించుకున్నాడు సోనూ సూద్.

pv sindhu
ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా తన పాత్రలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె నటిస్తే బావుంటుందని తన మనసులో మాటను బయటపెట్టింది పీవీ సింధు. దీపికా పదుకొనె స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ తో పాటు మంచి నటి అని కితాబిచ్చింది సింధు. అందుకే తన బయోపిక్ లో తన పాత్రలో దీపికా నటిస్తే చూడాలని ఉందని చెప్పిన సింధు. ఐతే తుది నిర్ణయం మాత్రం నిర్మాత, దర్శకులదే అని స్పష్టం చేసింది.

- Advertisement -

Tags: sindhu, pv sindhu, pv sindhu biopic, pv sindhu biopic movie, pv sindhu about deepika padukone, sonu sood about pv sindhu biopic

Leave A Reply

Your email address will not be published.