కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న ఖాకీలు

news02 May 22, 2018, 12:35 p.m. sports

reeva solanki

జామ్‌న‌గ‌ర్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్యకు చేదు అనుభ‌వం ఎదురైంది. జామ్‌న‌గ‌ర్‌లో ఓకానిస్టేబుల్ జ‌డ్జేజా వైఫ్ రీవా సోలంకిపై దాడికి పాల్ప‌డ్డాడు. సోమ‌వారం సాయంత్రం  రీవా సొలంకీ జామ్‌న‌గ‌ర్‌లోని సారు రోడ్డుపై కారులో ప్ర‌యాణిస్తున్న సంద‌ర్భంగా ఈసంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆమె సా రోడ్డులో కారులో వెళ్లుతున్న స‌మ‌యంలో రాంగ్ రూట్‌లో ఎదురుగా వ‌చ్చిన అహిర్ అనే కానిస్టేబుల్ ద్విచ‌క్ర  వాహ‌నాన్ని రీవా కారు ఢీకొట్టింది. దీంతో ఆగ్ర‌హించిన అహిర్ ఆమెపై దాడి చేసిన‌ట్లు ప్ర‌త్యేక్ష సాక్షులు తెలిపారు. జుట్టుప‌ట్టుకొని లాగేందుకు ప్ర‌య‌త్నించ‌గా విడిపించిన‌ట్లు వెల్ల‌డించారు. 

reeva solanki 2

అయితే రీవా సోలంకిపై దాడి ఘ‌ట‌న విష‌యంలో జామ్‌న‌గ‌ర్ ఎస్పీ ప్ర‌దీప్ సేజుల్‌ స్పందించారు. రీవా ఫిర్యాదు మేర‌కు ఇప్ప‌టికే కానిస్టేబుల్ అహిర్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కానిస్టేబుల్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. రీవాకు అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు.

tags: ravindrajadeja,reevasolanki,canstable attack,jamnagar,saa road,police

Related Post