ఇలా కూడా అవుట్ అవుతారా.?

news02 March 1, 2019, 10:49 p.m. sports

diffarent_wiket_oun_in_womens_criket

క్రికె్ట్ లో అవుట్ అంటే.. బోల్డ్ కావ‌డం.. క్యాచ్ అవుట్ కావ‌డం.. స్టంప్ అవుట్ కావ‌డం.. ర‌నౌట్ కావ‌డం.. చివ‌రికి హిట్ వికెట్ తో అవుట్ కావ‌డం మాత్ర‌మే మ‌న‌కు ఇప్ప‌డి వ‌ర‌కు తెలుసు... కాని  క్రికెట్ చరిత్రలో ఎప్పడూ చూడని అవుట్.. ఇప్ప‌డి వ‌ర‌కు ఏక్రికెట్ ఫార్మాట్ లో కూడా చూడ‌ని వింత అవుట్ ..కు వేదికైంది  ఆస్ట్రేలియా-కివీస్ ఉమెన్ వండే క్రికెట్ మ్యాచ్. ఇన్నింగ్స్‌ 45వ ఓవర్లో ఆస్ట్రేలియా బౌలర్‌ హీథర్‌గ్రహం వేసిన ఓ బంతిని కివీస్‌ బ్యాట్స్ ఉమెన్ కేటీపర్కిన్స్‌ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడింది. ఆ బాల్ సరాసరి నాన్‌స్ట్రైకర్‌ క్యాటీమార్టిన్‌ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే బౌలర్‌ హీథర్ గ్రహం ఆ బంతిని అందుకోవడంతో పర్కిన్స్‌ వికెట్ ను కివీస్ కోల్పోయింది.  ఇలా ఈ వింత సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో  న్యూజీలాండ్‌ 50 ఓవర్లకు 323-7తో నిలిచి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్‌ నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ కేవలం 157 పరుగులకే కుప్పకూలడంతో మ్యాచ్ ను కివీస్ కైవసం చేసుకుంది.

tags: womens criket, criket history, diffarent wiket out, kivis vs astrelia womens criket, boilling, heathr graham, batswomen,ketiparkins

Related Post