News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సైరా నరసింహారెడ్డి రివ్యూ

సినిమా- సైరా నరసింహా రెడ్డి
తారాగణం- చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చాసుదీప్, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు
ర‌చ‌న‌- ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్ బుర్రా
సంగీతం- అమిత్ త్రివేది
కెమెరా- ర‌త్న‌వేలు
నిర్మాత‌- రామ్‌చ‌ర‌ణ్‌
ద‌ర్శ‌క‌త్వం- సురేంద‌ర్ రెడ్డి
పరిచయం…..
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు చిరంజీవి. ఐతే చిరంజీవి తన కెరీర్ లో మొత్తం 150 సినిమాలు చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఓ చారిత్రాత్మకమైన కధాంశంతో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ ఒక్క సారిగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి  ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమా చేయాల‌నే ఆలోచన వచ్చింది. తండ్రి రీ ఎంట్రీ సినిమాను నిర్మించిన రామ్‌చ‌రణ్ ఈ హిస్టారిక్ మూవీ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. అమితాబ్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు ఇలా భారీ తారాగ‌ణంతో సైరా నరసింహారెడ్డి సినిమాను నిర్మించారు. మరి భారీ అంచనాల మధ్య నిర్మితమైన సైరా నరసంహారెడ్డి సినిమా ఎలా ఉందో చూసేద్దామా…

- Advertisement -


సైరా నరసింహారెడ్డి కధ….
భారత దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర్య స‌మ‌రంలో పాల్గొన్న ఝాన్సీ ల‌క్ష్మీబాయ్(అనుష్క‌) త‌న సైనికుల్లో స్ఫూర్తి నింప‌డానికి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను చెప్పడం ప్రారంభిస్తుంది. దేశంలో మొదటి స్వాతంత్య్ర స‌మ‌రం కంటే ముందు 1847లో రాయ‌ల‌సీమలోని ఉయ్యాల‌వాడ ప్రాంతానికి చెందిన  న‌ర‌సింహారెడ్డి(చిరంజీవి) పాలెగాడుగా ఉంటాడు. బ్రిటీష్ వారి ప‌రిపాల‌న‌లో ఉన్న ఈ ప్రాంతంలో నరసింహారెడ్డితో పాటు మొత్తం 61 మంది పాలెగాళ్లు ఉండేవారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో తీవ్ర‌మైన క‌రువు వ‌స్తుంది.
అయినప్పటికీ బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారుల‌ను ప‌న్నులు క‌ట్ట‌మ‌ని వేధిస్తుంటారు. దీంతో సైరా నరసింహారెడ్డి తన గురువు గోసాయి ఎంక‌న్న(అమితాబ్ బ‌చ్చ‌న్‌) స్ఫూర్తితో బ్రిటీష్‌వారు చేసే అకృత్యాలను ఎదిరిస్తాడు. సైరా నరసింహారెడ్డికి రాజా పాండి(విజ‌య్ సేతుప‌తి), వీరా రెడ్డి(జ‌గ‌ప‌తిబాబు), అవుకు రాజు(కిచ్చాసుదీప్‌) త‌దిత‌రులు అండ‌గా ఉంటూ వస్తారు. మరి ఈ పోరాటంలో బ్రిటీష్‌వారికి సైరా నరసింహా రెడ్డికి ఎలాంటి పోరాటాలు జరిగాయి.. చివరికి గెలిచిందెవరు అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే…..
ఎవరెలా చేశారంటే..
చిరంజీవికి నటన కొత్తేం కాదు. 150 సినిమాల్లో నటించిన ఆయన ఏ పాత్రలోనైనా పరకాయప్రవేశం చేస్తారు. ఐతే ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో చిరంజీవి నటించడం ఇదే తొలిసారే అయినా.. ఆ పాత్రలో జీవించారని చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులోను చిరంజీవి చేసిన యాక్షన్ సీన్స్ చూస్తే అబ్బురపడాల్సిందే. డైలాగ్స్ చెప్పడంలో గాని, స్వాతంత్ర్యం గురించిన భావోద్వేగాలు పండించడంలో గాని, యాక్షన్ సన్నివేశాల్లో గాని.. ఇలా అన్నింట్లోను చిరంజీవి తనదైన స్టైల్ నటనతో ఆకట్టుకున్నారు. అటు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర నిడివి తక్కువే అయినా ఆయన తన సహజ న‌ట‌న‌తో కట్టిపడేశారు. ఇక రాజా పాండి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, అవుకురాజు పాత్ర‌లో కిచ్చాసుదీప్, వీరారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు, సిద్ధ‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార‌, లక్ష్మీ పాత్ర‌లో త‌మ‌న్నా.. ఇలా అంతా ఆయా పాత్ర‌ల‌కు జీవం పోశారు.

- Advertisement -

ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌లా రూపొందించాడు. నిర్మాత రాంచరణ్ సైరా నరసింహారెడ్డి సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించారు. అమిత్ త్రివేది సంగీతం, జూలియ‌స్ పేకియం నేప‌థ్య సంగీతం ఆకట్టుకున్నాయి. సీనియర్ కెమెరామెన్ ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అద్భుతం అనిపించకమైనదు. బాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ గ్రెగ్ పావెల్‌, లీ విట్టేక‌ర్‌ తో పాటు రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు యాక్షన్ సన్నివేశాలను ఔరా అనిపించారు.

ప్ల‌స్ పాయింట్స్‌………
చిరంజీవి
ఆసక్తిరేపే ఇంట‌ర్వెల్‌
యాక్ష‌న్ సన్నివేశాలు
దేశ‌భ‌క్తి స‌న్నివేశాలు
భారీ తారాగ‌ణం
అద్భుతమైన నిర్మాణం
మైన‌స్ పాయింట్స్‌………
ఫ‌స్టాఫ్ సాగదీయడం

కధను కొన్ని సందర్బాల్లో వక్రీకరించడం

న్యూస్ పిల్లర్ రేటింగ్- 3.5/5

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.