News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఉయ్యాలవాడ కుటుంబీకుల్ని మాపై ఉసిగొల్పారు-చిరు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తమ వంశస్థుడి మీద సినిమా తీసినందుకు తమకు రూ.50 కోట్లు చెల్లించాలని ఉయ్యాలవాడ కుటంబీకులు చిత్ర నిర్మాత రామ్ చరణ్‌ను డిమాండ్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు ఈ విషయమై. ఐతే సైరా నరసింహారెడ్డి సినిమా బయోపిక్ కాదని, కల్పిత కథ అని చెప్పడం ద్వారా ఈ కేసును కొట్టివేసేలా చేయగలిగాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. దీంతో వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఈ వివాదం విషయమై చిరు ఏమంటాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే ఓ ఇంటర్వ్యూలో చిరు ఈ విషయమై ఓపెన్‌గానే మాట్లాడాడు. తన వెర్షన్ వినిపించాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులని.. వారిని ఎవరో తమ మీదికి ఉసిగొల్పి పంపారని చిరు ఆరోపించడం గమనార్హం. నిజానికి వాళ్ల ఆర్థిక పరిస్థితి సామాన్యమే అని.. కానీ తమకు రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించాడు చిరు. ముందు తాము వారికి, వాళ్ల ఊరికి సాయం చేయాలనే అనుకున్నామని.. ఆ విషయం చూడమని ఎన్వీ ప్రసాద్‌కు చెప్పామని.. కానీ వాళ్లొచ్చి పాతిక కుటుంబాలున్నాం. మాకు కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అన్యాయంగా అనిపించిందని చిరు చెప్పాడు.

- Advertisement -

వందేళ్లు అయిన తర్వాత ఎవరి కథ అయినా చరిత్రే అని కోర్టు చెప్పిందని.. స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్‌ పాండే మీద తీసిన సినిమా విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఒక కథ చరిత్రగా మారడానికి అరవై ఏళ్లయితే చాలని చెప్పిందని… దాని మీద వారసులకు హక్కు ఉండదని అన్నాడుు చిరు. ఇప్పుడు పాతిక కుటుంబాలకు సాయం చేస్తే.. తర్వాత ఇంకొందరు తామూ వారసులమేనని రారని గ్యారెంటీ ఏమిటని ఎన్వీ ప్రసాద్‌ ప్రశ్నించినట్లు చిరు వెల్లడించాడు. నిజానికి కొన్ని కుటుంబాలు ఇలా డబ్బులు డిమాండ్ చేస్తే.. ఇంకొందరు వచ్చి తమ వాళ్లు డబ్బు కోసం ఇలా చేసినందుకు మన్నించాలని అన్నారని చిరు గుర్తు చేశాడు. తాము చరిత్రను వక్రీకరిస్తే తప్పుబట్టాలని.. అంతే తప్ప డబ్బులు అడగకూడదని.. అడిగినా ఇవ్వాల్సిన అవసరం చట్టపరంగా లేదని.. రొప్పొద్దున ‘సైరా’ సినిమాకు లాభాలు వస్తే, ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలని భావిస్తున్నామని చిరు స్పష్టం చేశాడు.

Tags: uyyalavada, controversy, chiranjeevi, syeraa narasimha reddy, movie review, rating, oct 02

Leave A Reply

Your email address will not be published.