News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గాంధీభవన్ లో  టి.కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ..

  • రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన కోర్ కమిటీ ..
  • ప్రియాంక రెడ్డి మరణానికి ప్రభుత్వానిదే భాద్యతన్న కాంగ్రెస్ ..

కేసీఆర్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వరుస ఘటనలు జరుగుతున్నా .. ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉన్నాయని హస్తం నేతలు మండిపడుతుమన్నారు. గాంధీభవన్ లో సమావేశమైన టి.కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రియాంకా రెడ్డి పై జరిగిన దాడి .. ఆమె మరణాన్ని తీవ్రంగా పరిగణించాలని అభిప్రాయపడింది. రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నా సర్కార్ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయని ఆరోపించింది. ప్రియాంక రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సంతాపం ప్రకటించారు. ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేదిగా ఉందని హస్తం నేతలు అన్నారు.ప్రియాంక మరణానికి కేసీఆర్  ప్రభుత్వమే కారణమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తల్లి తండ్రులు పోలీస్ లు హేళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన ..  ఘటన పై సకాలం లో స్పందించని పోలీస్ ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులకు త్వరగా శిక్షపడేలా చేయాలన్నారు. ఇక ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు.

- Advertisement -

4ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చర్చించిన కాంగ్రెస్ కోర్ కమిటీ ..  జీతాలు ఇవ్వలేమని కోర్ట్ కు తెలిపిన ప్రభుత్వం సమ్మె విరమించిన తరవాత 100 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించడం కోర్ట్ ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని అభిప్రాయ పడింది. ఇక బస్ చార్జీల పెంపును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ .. దీనిపై అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలపైనా పీసీసీ కోర్ కమిటీ సీరియస్ గా చర్చించింది. మున్సిపాలిటీ ల వారిగా పార్టీ పరిస్థితి .. గెలుపు అవకాశాలు .. అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు హస్తం నేతలు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణం బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్. నాయకులు .. ఈ అంశాన్ని  దేశ ప్రజలకు తెలిపేందుకు డిసెంబర్ 14న ఢిల్లీ రాంలీల మైదానం లో భారత్ బచావో పేరుతో నిర్వహిస్తున్న ర్యాలీ కి పెద్ద సంఖ్యలో పార్టీ క్యాడర్ ను తరలించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిపై అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు తగు సూచనలు చేశారు కోర్ కమిటీ సభ్యులు.

Leave A Reply

Your email address will not be published.