News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వారానికి రెండు రోజులు ప్రజాధర్భార్

గవర్నర్ తమిళ్ సై ప్రజాధర్భార్ నిర్వహిస్తానని ట్వీట్ చేయటం అధికారపార్టీ లో అలజడి రేపింది. ఇన్నాళ్లు సీఎం నిర్వహించని ప్రజా దర్బార్ ను గవర్నర్ నిర్వహించేందుకు సిద్ధం కావటం చర్చనీయాంశమయ్యింది. అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా గవర్నర్ ప్రజాధర్భార్ పైనే చర్చించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత.. సీఎం కేసీఆర్ రెండోసారి సైతం అధికారపగ్గాలు చేపట్టినా….ప్రజలు నేరుగా తనను కలిసే ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు క్యాంప్ ఆఫీసులో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొనేందుకు ప్రజా దర్బార్ నీ నిర్వహించే వారు. ఏ సమస్య అయినా నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజలకు ఉండేది. అయితే ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత..కేసీఆర్ సైతం ప్రజా దర్బార్ నీ నిర్వహిస్తారని ప్రచారం జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు. మరో వైపు వివిధ గ్రూప్ లు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు , నేరుగా ప్రగతి భవన్ కి తీసుకొచ్చి వారితో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఒకటి,రెండు నెళ్లకే పరిమితం కావడం తో ఇక సీఎం నీ సామాన్య మానవులు కలవడం అసాధ్యంగా మారింది.

Telangana Governor thamil sai shock to cm kcr

- Advertisement -

ఉద్యమం సమయం లో నేరుగా ప్రజలను కలిసిన కేసీఆర్ … ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను కలిసే అవకాశం లేకుండా పోయింది. వివిధ ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలకు బహిరంగ సభలు నిర్వహించినా తమ సమస్యల ను చెప్పుకొనే ఛాన్స్ కరువయ్యింది. దూరం నుంచి చూడటం తప్పా.. సీఎం కేసీఆర్ ను కలిసింది లేదు. ప్రజలను కలవని సీఎం అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినా trs అధిష్టానం సీరియస్ గ తీసుకోలేదు. సమస్య పరిష్కారం కావాలి అంటే నేరుగా సీఎం నీ కలవాల్సిన అవసరం లేదు …కింది స్థాయి అధికారులతో …నేతలను కలిసి సమస్య పరిష్కరించుకోవచ్చని సీఎం కేసీఆర్ పలు వేదికలపై కౌంటర్ ఇచ్చారు. ప్రజలకే కాదు…ఎమ్మెల్యే లు,మంత్రులు కూడా కొన్ని సార్లు కలవడం కుదరడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సీఎం కేసీఆర్ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మొగ్గు చూపలేదు.

అయితే trs పార్టీ అధికారం లో కొచ్చి ఆరేళ్ళు పూర్తి కావస్తున్నా సామాన్యుడు సీఎం కేసీఆర్ నీ కలిసే అవకాశం రాలేదు. కొత్తగా వచ్చిన గవర్నర్ తమిళ సై తాను ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నా అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చా నియంశం గా మారింది. అసెంబ్లీ లాబీల్లో ఎక్కడ చూసినా తమిళ సై ట్వీట్ పైనే చర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ వదిలేసిన ప్రజా దర్బార్ నీ గవర్నర్ వెల్గులోకి తీసుకు రావడం పై అధికార పార్టీ లో గుబులు పుట్టిస్తోంది. గవర్నర్ ప్రజా దర్బార్ ఎందుకోసం నిర్వహిస్తున్నారు అని… దాని వెనుక మర్మం ఏమిటో అనే అలజడి గులాబీ దళం లో మొదలయ్యింది. ప్రజా దర్బార్ నిర్వహిస్తే trs మీద చాలా ఎఫెక్ట్ పడుతుందని… ప్రజలంతా రాజ్ భవన్ వైపు వెళ్లే అవకాశాలు లేక పోలేదని ఎమ్మెల్యే లు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తమిళ సై ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధం కావడం … తెలంగాణ లో రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయి అంటూ పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తి నెలకొంది.

Tags: Telangana new governor, tamil sai life history, cm kcr, telamgana rajbhavan, telangana new governor, cm kcr family.

Leave A Reply

Your email address will not be published.