News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలంగాణ సర్కార్ కొత్త మద్యం పాలసి

  • 5 వేల జనాభా ఉన్న చోట
  • వైన్ షాప్ 50 లక్షలు
  • గ్రేటర్ లో ఏడాదికి 1 కోటి 10 లక్షలు లైసెన్స్ ఫీజు.
  • ప్రతి దరఖాస్తుకు రెండు లక్షలు కట్టాల్సిందే (నాన్ రిఫండబుల్ )

తెలంగాణ ప్ర‌భుత్వం 2019-21 కి గాను కొత్త ఎక్సైజ్ పాల‌సీని ప్ర‌క‌టించింది. తెలంగాణ లో కొత్త మ‌ధ్యం పాల‌సీ. వచ్చేనెల ఒకటవ తేదీ నుండి .. ఆక్టోబ‌ర్ 2021 వరకు అమ‌లు లో. ఉంటుంది . ఐతే ఈనెల ఒకటి నుండి అమలులో ఉండాల్సిన పాల‌సీని బ‌డ్జెట్ స‌మావేశాల కార‌ణంగా నెల ఆల‌శ్యంగా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మ‌ధ్యం పాల‌సీ వచ్చే నెల ఒకటో తేదినుండి .. ఆక్టోబ‌ర్ 2021 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఆదాయం పెంచుకునే విధంగా.. గ‌త మ‌ధ్యం పాల‌సీకి మార్పులు చేసింది ప్ర‌భుత్వం.

తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 2216 వైప్ షాపులు ఉన్నాయి. వీటికి న‌వంబ‌ర్ ఒక‌టి నుండి కొత్త మ‌ధ్యం పాల‌సి వ‌ర్తించ‌నుంది. గ‌త ఎక్సైజ్ పాల‌సీలో బారి మార్పులు చేసింది ప్ర‌భుత్వం. గ‌తంలో నాలుగు స్లాబుల‌లో ఉన్నమ‌ధ్యం షాపు లైసెన్స్ పీజును ఈసారి.. ఆరు స్లాబుల‌కు పెంచింది స‌ర్కార్. గ‌తంలో మొద‌టీ స్లాబు 50 వేల జ‌నాబా క‌ల్గిన చోట‌.. మ‌ధ్యం షాపుకు.. 45 ల‌క్ష‌లు ఉండ‌గా..ఈసారి.. దానిని 5వేల జ‌నాభా ను మొద‌టీ స్లాబుగా ప్ర‌క‌టించి.. దానికి 50 ల‌క్ష‌లు లైసెన్స్ ఫీజును వ‌సూల్ చేయ‌నుంది స‌ర్కార్.

- Advertisement -

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త మ‌ద్యం పాల‌సీ ప్ర‌కారం.. ఐదు వేల జ‌నాభా ఉన్న చోట‌..50 ల‌క్ష‌లు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న చోట 55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న చోట 60 లక్షలు లైసెన్స్ ఫీజు., 1 లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న చోట 65 లక్షలు లైసెన్స్ ఫీజు. 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న చోట 85 లక్షలు లైసెన్స్ ఫీజులు ఉండ‌గా.. 20 లక్షలు ఆ పై జనాభా ఉన్న చోట 1 కోటి 10 లక్షలు లైసెన్స్ ఫీజును ఉండ‌నుంది. ఇవ‌న్ని కూడా ఏడాదికి మాత్ర‌మే. ఇక గ‌తంలో ఒక ద‌ర‌ఖాస్తుకు ల‌క్ష రూపాయ‌లు నాన్ రిఫండ‌బుల్ గా ఫీజును.. ఈ సారి రెట్టింపు చేస్తూ.. దానిని రెండు ల‌క్ష‌ల‌కు పెంచింది ప్ర‌భుత్వం.

మ‌ధ్యం అమ్మకాల ద్వారా గ‌త ఏడాది ప్ర‌భుత్వం 10 వేల 500 కోట్ల ఆదాయం రాగా…. ఈసారి ఆదాయం బాగా పెర‌గ‌నుంది. దీనికి తోడు.. ఏపీలో మ‌ధ్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వంమే చెప‌ట్ట‌డంతో.. ఇక ఏపీకి చెందిన వ్యాపారులు బారిగా తెలంగాణ‌లో మ‌ధ్యం వ్యాపారం కు రానుండంటంతో..ఒక్క‌ ధ‌ర‌ఖాస్తుల ద్వారానే గ‌తం క‌టంఏ.. రెండింత‌ల ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తుంది ప్ర‌భుత్వం.

Leave A Reply

Your email address will not be published.