News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బోరు కొట్టిస్తున్న బిత్తిరి సత్తి పోయి మంచి పని చేసిండు. వైరల్ అయిన మెసేజ్

వార్తల్లో విప్లవాన్ని సృష్టించిన తీన్మార్ లో కొన్ని రోజుల నుంచి మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు తీన్మార్ బ్రాండ్ గా ఉన్న సావిత్రి-బిత్తిరి సత్తి ఇద్దరు కనిపించడంలేదు. కొత్త పాత్రలు తెరమీదకు వస్తున్నాయి. తీన్మార్ యాంకర్ సావిత్రి బిగ్ బాస్ షో కు కంటెస్టెంట్ గా వెళ్లింది. ఇక బిత్తిరి సత్తి కూడా వేరే ఛానల్ కు వెళ్తున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా తీన్మార్ చూసే ఒక ప్రేక్షకుడి అభిప్రాయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నా పేరు నరసింహులు* యాదాద్రి జిల్లా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తా*

నేను గత నాలుగేళ్ల నుంచి రెగ్యులర్ గా వీ6 న్యూస్ లో తీన్మార్ చూస్తున్నాను. తీన్మార్ బులెటెన్ చూడనిదే మా ఊరు నిద్రపోదు. మా తాన చాలా ఎక్కువ మంది ఉద్యోగు లు ఉంటరు. చదువుకున్నోళ్ల సంఖ్య చాలా ఎక్కువ. రోజూ సిటీకి అప్ అండ్ డౌన్ చూస్తుంటాము. ఎవరైనా డైరెక్ట్ టీవీ ల చూడటం మిస్ అయితే తర్వాత యూటూబ్ లో చూస్తాం. ఎన్నో ఏళ్ల నుంచి తీన్మార్ చూస్తున్నాం. రోజు రోజు కూ ఇంకా, ఇంకా మజా ఉంటది కాని ఏ ఒక్క రోజు బోర్ కాదు. మంచి వార్తలు మా ఊరి భాష లో, మా యాస లో చెబుతారు.

మల్లన్న నుంచి మొదలుకొని, రాములమ్మ, లచ్చవ్వ, మంగ్లీ, సుజాత, చిట్టెమ్మ గిట్లాంటి ఎన్నో పాత్రలు వచ్చినయి పోయినయి. *

- Advertisement -

*గిప్పుడేమో సావిత్రి, బిత్తిరి సత్తి. గీళ్లిద్దరి కాంబినేషన్ మంచిగుండే. ఈ మధ్యల సావిత్రి బిగ్ బాస్ షో కు పోయి తీన్మార్ కు రాజీనామా చేసిందంట.* మా ఊళ్ల గీ విషయం తెల్వగానే బాగా చర్చ అయింది. గాని నాతో సహా శానా మంది ఒక్కటే అనుకున్నాం, *“తీన్మార్ పాత్రల్ని తయారు చేస్తది, ఫేమస్ చేస్తది. వాళ్లు పోతే కొత్త పాత్రలు వస్థాయి. అవి పాత వాళ్లకంటే శాన్ దార్ గా ఉంటయి*. అన్నట్లుగానే సావిత్రి పోతే రాధ వచ్చింది. పాతామె కంటే గీమెనే శానా బాగా వార్తలు చెబుతుంది. ఇగ ఈ మధ్య కొన్ని రోజుల నుంచి బిత్తిరి సత్తి కనిపిస్తలేడు. ఆయన కూడా వేరే చానల్ కేమైనా పోయిండేమో. నేను వీ6 తీన్మారోళ్లకు ఒకటే చెబుతున్న…. “ఆ సత్తి ఉంటే ఎంత, పోతే ఎంత. ఎందుకంటే ఆరేడు నెలలనుంచి సత్తి మంచిగ చేస్తలేడు. ఆంతకు ముందు మా ఊరోని లెక్క, మా ఇంటోని లెక్క మాట్లాడుతుండే. ఇప్పుడేమో డ్రామాలాడినట్లు చేస్తుండు. మాకైతే కొన్ని నెలలనుంచి బోర్ అయుండు. గీయన దుకాణం సాలు, వీ6 న్యూస్ వాళ్లే పంపించేస్తరో, ఎనక నుంచి మాటలు చెప్పిస్తరో కాని ముందుకు మాత్రం వద్దు అని మేమె అనుకున్నాం. సత్తిది యాక్సన్ బోయి, ఓవర్ యాక్షన్ అయిందీ.

మొన్నామధ్య వాట్సప్ ల చదివినా… సత్తి పాత్ర తీన్మార్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోంది. సావిత్రి పాత్ర కూడా అంతే… ఏదో బిగ్ బాస్ అవకాశం వచ్చి ఆమె పోయింది. ఇక సత్తి కూడా ఏదన్నా చూసుకొని వెళ్ళిపోవడ మో లేక ఆయనను తీన్మార్ నుంచి తప్పిస్తెనో తప్ప మాలాంటి సగటు తీన్మార్ ప్రేక్షకుల కు కొత్త రుచి రుచి దొరికేటట్లు లేదు.

*బిత్తిరి సత్తి 14 ఏండ్ల సంది సినిమా ఆపీసులు, టీవీ ఆపీసుల చుట్టూ తిరిగిండంట. యాక్షన్ కూడా సేసిండంట. కాని పెద్దగా ఎవరికి తెల్వలే. ఆయన జీరో. వేరే ఏదో ఛానళ్ల కూడా సేసిండంట కదా. అది కూడా ఎవరికి తెల్వదు. కాని తీన్మార్ కు వచ్చినంక పామెన రవి అనేటోడు బిత్తిరి సత్తి గా ఫేమస్ అయిండు. ఆయనకు ఆయన గాలే…. వీ సిక్స్ న్యూసోళ్లు చేసిండ్రు. *తీన్మార్ వల్లనే ఈ పాత్రలన్నీ ఫేమస్ అయినయి అని నా అభిప్రాయం. ఎందుకంటే గీళ్లు రాకముందు నుంచి మేం తీన్మార్ చూస్తున్నాం. వీళ్లలో చాలా మంది పోయినంక కూడా సూస్తున్నాం. సత్తి పోయినా ఈ బులిటెన్ కు చిన్న లోటు కూడా లేదు. పైగా కొత్తవాళ్లతో కొత్తగా ఉంది*. ఎందుకంటున్న అంటే సావిత్రి పోయినంక మేం అన్నట్లే రాధా పుట్టుకొచ్చింది. ఇగ పద్మ మస్తుగ మాట్లాడుతుంది. ఇయ్యాల రేపు గా చంద్రవ్వ అయితే ఓ …. సూపర్. దంచికొడుతోంది.

వీ6 తీన్మార్ పెద్ద సారు కు నేను ఒకటే చెబుతున్నా…. *మధ్యల వచ్చినోళ్లు మధ్యల్నే పోతరు. ఎనకటికి మల్లన్న పోతే ఏం గాలే, రాములమ్మ పోతే ఏం గాలే, నిన్న మొన్న సావిత్రి పోతే ఏం గాలే, బిత్తిరి సత్తి పోతే కూడా ఏం గాదు*. మీరు ఇప్పటికే కొత్త పాత్ర తయారు చేసే ఉంచి ఉంటరు లే. నేను ఉరోన్ని నాకంటే మీకే ఎక్కువ తెల్సు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.