News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

చరిత్రలో ఈ రోజు నవంబర్ 1

సంఘటనలు
1952: అమెరికా చే మార్షల్ దీవులలో ‘ఎనెవెటాక్’ వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.
1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1 వరకు).
1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం.
1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.
1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1959 : ఆంధ్ర ప్రదేశ్‌ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.
1983: ఆంధ్ర ప్రదేశ్లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.

జననాలు
1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.1980)
1915: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)
1919: అంట్యాకుల పైడిరాజు, ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (మ.1986)
1944: తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జననం
1945 : భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ జననం (మ.2013).
1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.
1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, ప్రముఖ నటి,
1974: వి.వి.యెస్.లక్ష్మణ్, ప్రముఖ క్రికెట్ ఆటగాడు.
1987 : తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.

- Advertisement -

మరణాలు
1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936)
1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే.
1996 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు మరణం (జ.1932).

పండుగలు మరియు జాతీయ దినాలు
– ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.
– కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.
– గర్వాల్ రైఫిల్ దినం.

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.