News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఫైర్ ..

అంజనీ కుమార్ టిఆర్ఎస్ కు తొత్తు ..
బీజేపీ, టిఆర్ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలు ..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష ..

హైదరాబాద్: సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఐపీఎస్ అని కాకుండా కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని పెట్టుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం జాతీయ కాంగ్రెస్ పార్టీ 134 వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పార్టీ కార్యాలయం లో జెండా ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ గాంధీభవన్ నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహం వరకు సేవ్ నేషన్ – సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీ చేయడానికి నేతలు సిద్ధమైయ్యారు. కానీ పోలీసులు అడ్డుకోవడం తో పీసీసీ అధ్యక్షుడు పార్టీ ఆఫీస్ లోనే సత్యాగ్రహ దీక్ష కు పూనుకున్నారు.

సిపీ అంజనీ కుమార్ పై చర్యలు తీసుకోవాలడానికి సోమవారం గవర్నర్ ని కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు ..అంజనీ కుమార్ కి  పోలీస్ కమిషనర్ గా ఉండే అర్హత లేదని విభజన బిల్లు లో పొందుపరిచిన విధంగా 10 సంవత్సరాలు గవర్నర్ కి హైదరాబాద్ పై హక్కు ఉందని ,సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు చర్యలు తీసుకునే అధికారం ఉందని అన్నారు ..అంజనీ కుమార్ క్యారెక్టర్ లెస్ ఫెల్లో అని , దిగజారిన పనులు చేసిన వ్యక్తి ,అవినితి పరుడని  తీవ్ర ఆరోపనలు చేశారు. మోడీ,అమిత్ షా లు దేశాన్ని విడదీస్తున్నారని,మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు ..కేసీఆర్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్.

- Advertisement -

Tags: TPCC, Chief Uttam, Fire, Hyderabad, Police, Commissioner

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.