News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ ఏడాది పాలన నిండా అరాచకాలే – ఉత్తమ్

కేసీఆర్ ఏడాది పాలన అరాచకాలతోనే గడిచిపోయిందని అన్నారు పీసీసీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చాక ఏడాది పాలనపై స్పందించిన ఉత్తమ్ .. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు సంధించారు. కేసీఆర్ కు ప్రజలు రెండోసారి అధికారం కట్టబెట్టినా ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్న ఉత్తమ్ .. మద్యం ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంలో మాత్రం అభివృద్ధి సాధించారని సెటైర్ విసిరారు. ఇక దిశ ఘటన, ఇంటర్ బోర్డు నిర్వాకంతో ., ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం పరువు పోయిందని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మరోవైపు మిగులు రాష్ట్రంగా ఉన్న కేసీఆర్ ., తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు ఉత్తమ్. కేసీఆర్ అసమర్థ పాలన పుణ్యమే.. రాష్ట్ర ఆర్థికస్థితి దిగజారడానికి కారణమని అన్నారు. కేసీఆర్ కమిషన్ల కోసమే లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు ను తీసుకువచ్చారన్న ఉత్తమ్ ., ఆర్థిక క్రమశిక్షణ గురించి కేసీఆర్ మాట్లాడుతుండటం విడ్డురంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చడం, కొత్త అసెంబ్లీ కట్టాలనుకున్నప్పుడు కేసీఆర్ కు ఇప్పుడు చెబుతున్న ఆర్ధిక క్రమ శిక్షణ గుర్తుకురాలేదా .? అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

- Advertisement -

Tags: uttam kumar reddy, kcr , telangana politics, comments

Leave A Reply

Your email address will not be published.