News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మంత్రి కేటీఆర్ ను ఆపేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ..

  • ప్రైవేటు వాహనంలో వచ్చిన కేటీఆర్ ను గుర్తించని ట్రాఫిక్ కానిస్టేబుల్ ..
  • ట్రాఫిక్ కానిస్టేబుల్ చర్యతో అవాక్కైన మంత్రి కేటీఆర్ ..

వరంగల్: మంత్రి కేటీఆర్‌ను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నారు. కేటీఆర్‌ తన కాన్వాయ్‌ లో కాకుండా ఓ ప్రైవేటు కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. దాంతో కేటీఆర్ ను గుర్తించని కానిస్టేబుల్ మంత్రి కాన్వాయ్ కి ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో కేటీఆర్ ను అడ్డగించారు. ఇక వివరాల్లోకి వెళితే .. వరంగల్‌ లో ఐటీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ నుంచి హన్మకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇంటికి బయల్దేరారు. అయితే మంత్రి కాన్వాయ్‌లో కాకుండా.. ఓ ప్రైవేటు వాహనాన్ని నడుపుకుంటూ బయల్దేరారు. అందులో ఉన్నది మంత్రి కేటీఆర్‌ అని తెలియక ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుతగిలి నిలిపివేశారు.

- Advertisement -

Tags: IT industry, started by Minister KTR, warangal city, Government Chief Whip, Dasam Vinay Bhaskar

Leave A Reply

Your email address will not be published.