News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రెచ్చిపోయిన టీఆర్ఎస్ లేడీ కార్పోరేటర్..!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కార్పోరేటర్ నుంచి మంత్రి దాక ప్రతి ఒక్కరు భూ సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, వసూళ్ళతో సామాన్య జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. అయితే ఇదంతా అధినేత కేసీఆర్ దృష్టికి వెళుతుందో లేదా, వెళ్ళినా వీటిని కేసీఆర్ పట్టించుకుంటున్నారా లేదా అనే సందేహాలు మాత్రం సామాన్య జనంలో తలెత్తుతున్నాయి.

అయితే తాజాగా టీఆర్ఎస్ అమీర్ పేట్ మహిళా కార్పోరేటర్ శేషకుమారి ఒక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో ఒక వ్యక్తికి ఇస్తున వార్నింగ్ వింటుంటే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఒక మహిళ అయ్యి ఉండి అసభ్య పదజాలంతో వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఇదంతా జరిగింది కూడా ఎక్కడో కాదు సాక్ష్యాతూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి ఇంట్లోనే కావడం ఇందులో మరో విశేషం. అయితే మహిళా కార్పోరేటర్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఒక మహిళ అయ్యి ఉండి అసభ్య పదజాలంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అంటున్నారు.

- Advertisement -

 

Leave A Reply

Your email address will not be published.