News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చేదు అనుభవాలు..

  • కెసిఆర్ కేటీఆర్ మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు
  • రెబెల్స్ బెడద కారులో కల్లోలం ..
  • టిఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరుతున్న పలువురు సీనియర్లు ..
  • నేతల వలసలతో బెంబేలెత్తిపోతున్న గులాబీ లీడర్స్ అండ్ క్యాడర్ ..
TRS bitter experience in municipal elections
TRS bitter experience in municipal elections

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో గెలుస్తామని రాష్ట్రస్థాయిలో కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు చెబుతున్న .. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తాజాగా .. బడంగ్‌ పేట్‌ కార్పొరేషన్‌ లో అధికార పార్టీకి మరో షాక్‌ తగిలింది.. ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ రాళ్లగూడెం సంతోషీశ్రీనివా‌స్‌రెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి, హస్తం గూటికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం గుర్రంగూడ మాజీ ఇన్‌చార్జి సర్పంచ్‌ జక్కిడి జంగారెడ్డి టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చి బీజేపీలో చేరగా .. ఇప్పుడు సంతోషీ శ్రీనివాస్‌రెడ్డి సైతం పార్టీ ఫిరాయించండంతో అధికార పార్టీ కంగు తిన్నది. 29వ వార్డులో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న సంతోషీశ్రీనివాస్‌రెడ్డికి చివరి నిమిషంలో మొండి చేయి చూపించడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. వెంటనే కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరిపి కాంగ్రెస్ లో చేరిపోయారు.

- Advertisement -

ఆమెతో పాటు ఆమె భర్త, టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా సంతోషీశ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్‌లందరికీ టిక్కెట్‌ ఇస్తామని నమ్మించి మోసం చేశారు .. మా సిట్టింగ్‌ స్థానాన్ని వేరే వారికి కేటాయించారు.. ఐదేళ్లు కౌన్సిలర్‌గా పని చేసిన నాకే అన్యాయం జరిగితే ఇక సాధారణ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమిటి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి గొంతులు కోయడం టీఆర్‌ఎస్ కు అలవాటేనని, ఆ పార్టీలో చేరిన నాయకులు వాస్తవం గ్రహించి బయటకు రావాలని ఆమె సూచించారు.

ఇక నల్గొండ లో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ కు ఓ నేత దిమ్మదిరిగి పోయె ఝలక్‌ ఇచ్చాడు. పార్టీ టికెట్‌ ఖరారైన తర్వాత మనసు మార్చుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లగొండ మునిసిపాలిటీ పరిధిలోని 24వ వార్డు నుంచి షఫీనవాజ్‌ ఖాన్‌కు ఈ నెల 6వ తేదీన ప్రకటించిన మొదటి జాబితాలోనే టీఆర్‌ఎస్‌ టికెట్‌ను కేటాయించారు. తర్వాత ఆయన నామినేషన్‌ వేయలేదు. ఆ సందిగ్ధానికి తెరదించుతూ .. నల్లగొండలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన షఫీనవాజ్‌ఖాన్‌ .. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Tags: telangana municipal elections, munci elections results 2020, uttam kumar reddy, kcr

Leave A Reply

Your email address will not be published.