News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలంగాణ ప్రభుత్వ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు

  • దిశ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
  • ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం

దిశ కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. హైకోర్టు స్పందన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ దీనిపై కసరత్తును ప్రారంభించింది. ఈరోజు లేదా రేపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ త్వరితగతిన సాగనుంది. రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకావం ఉంటుంది.

- Advertisement -

ఇటీవల వరంగల్ లో ఓ బాలిక హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా… కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై, తీర్పు వెలువడింది.

Tags: Telangana Govt, Fast track, Appeal Letter, High Court, Over Disha Incident Case

Leave A Reply

Your email address will not be published.