News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దీక్ష విరమించిన అశ్వత్తామ, రాజిరెడ్డిలు

  • ఆర్టీసీ సడక్ బంద్ వాయిదా ..
  • దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరి, మరియు ఆర్టీసీ జేఏసీ .. చలో ట్యాంక్ బండ్ సందర్బంగా ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ లకు నిరసనగా ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నేతలు నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు.శనివారం(నవంబర్ 16,2019) ఉదయం జేఏసీ నేతలు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే . ఐతే నేతల ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడ కూడా జేఏసీ నేతలు దీక్షను కంటిన్యూ చేశారు.

- Advertisement -

ఇదిలావుంటే ఈరోజు సోమవారం హైకోర్టు ఆర్టీసీ కేసును లేబర్ కోర్ట్ కు బదిలీచేశారు. దీనితో జేఏసీ తన వ్యూహాన్ని మార్చింది . దీనిలో భాగంగా జేఏసీ నేతల దీక్షను విరమింప చేయడంతోపాటు నవంబర్ 19న తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత సమ్మెపై తుది నిర్ణయాన్ని మంగళవారం(నవంబర్ 19,2019) సాయంత్రం ప్రకటిస్తామన్న అశ్వత్తామ.., సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. కోర్టు తీర్పుని గౌరవించి ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం.. కార్మికులతో చర్చలు జరపాలని, సమస్యని పరిష్కరించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెపై మంగళవారం సాయంత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అన్నది ఆసక్తి రేపుతోంది.

Tags: ts rtc sadak strike postponed, tsrtc jac, leabour court, aswarthama reddy, raaji reddy

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.