కోర్టు తీర్పును పరిశీలించాక సమ్మెపై నిర్ణయం తీసుకుంటాం: అశ్వత్థామరెడ్డి
- ముగిసిన ఎంప్లాయీస్ యూనియన్ నేతల సమావేశం
- కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుంది
- ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయి
టీఎస్సార్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతల సమావేశం ముగిసింది. సమ్మె కొనసాగించాలని ఈయూ నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన ఆందోళనా కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు.
అనంతరం, మీడియాలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, కోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత సమ్మెపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని డిపోల ఆర్టీసీ కార్మికుల అభిప్రాయాలు తీసుకున్నామని, జేఏసీ నేతల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు చెప్పారని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని మరోమారు స్పష్టం చేశారు.
Tags: Tsrtc Jac, Aswathamareddy, High Court, tsrtc strike