News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సీపీఐ కార్మికుల వైపా ..? కేసీఆర్ వైపా ..?ఉత్తమ్

  • కార్మికులపై కేసీఆర్ నిరంకుశత్వంపై సిపిఐ మౌనమేల : ఉత్తమ్
  • హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ మద్దతుపై సీపీఐ  పునరాలోచించాలి : ఉత్తమ్
  • తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు
  • కార్మికుల ఆందోళల్లో కాంగ్రెస్ క్యాడర్ పాల్గొనాలి : ఉత్తమ్
  • కార్మికులను భయపెట్టి విధుల్లో చేర్చుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యమా : భట్టి
  • సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న భట్టి

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ధర్నాలకు .. ఆందోళనలకు పార్టీ కార్యకర్తలు .. నాయకులు హాజరై మద్దతు తెలపాలని ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ కు పిలుపునిచ్చిన.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ ఆదేశాలమేరకు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నాయి. ఇక హుజూర్ నగర్ లో టీఆరెస్ కు మద్దతు పలికిన సీపీఐ పార్టీ కార్మికవర్గాల వైపో లేక ప్రభుత్వం వైపు ఉంటుందో తెల్చుకోవాలని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

- Advertisement -

కార్మిక , కర్షక వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన పార్టీగా చరిత్ర కల్గిన సీపీఐ .. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల పై కేసీఆర్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంటే ఎందుకు మౌనంగా ఉందని తన ట్విట్టర్లో  ప్రశ్నించారు ఉత్తమ్. ప్రభుత్వ తీరుతో తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీపీఐ ఎందుకు మౌనంగా ఉందని ఉత్తమ్ అన్నారు. ఇప్పటికైనా సీపీఐ ఎటువైపో తేల్చుకోవాలన్న ఉత్తమ్ .,  హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచించాల అని సీపీఐకి విజ్ఞప్తి చేశారు.

ఇక ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను కలసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క .. కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలన్న బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు 30 రోజుల క్రితం సమ్మె నోటీసులు ఇస్తే .. సమ్మెకు వెళ్లేవరకూ సర్కారు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.

batti vs kcr

సీఎంకు ప్రజల మీద ఏ మాత్రం బాధ్యత ఉన్నా మంత్రులతో కమిటీ వేసేవారని .. కానీ అందుకు భిన్నంగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా బెదిరించి విధులకు హాజరుకావాల్సిన చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఉద్యమ సమయంలో కార్మికుల హక్కుల గురించి గొప్పగా మాట్లాడిన కేసీఆర్‌ కు ఇప్పుడు వారు బరువైపోయారా అని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి.

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.