News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ వచ్చి కూర్చున్నా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ దే గెలుపు ..!

త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ విస్ఫోటనం తప్పదని టీపీసీసీ చీఫ్ .. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడతో ఆ పార్టీలో అసంతృప్తి నిగురుగప్పిన నిప్పులా ఉందన్నారు. గులాబీ గూటిలో సల సల మసలుతున్న రాజకీయ లావా ఏ క్షణమైమా కేసీఆర్ ను దహించివేయడం ఖాయమన్నారు. యాదాద్రి ఆలయం పై కేసీఆర్ బొమ్మలు చెక్కించు కోవడం పోయేకాలానికి నిదర్శనమన్నారు.

Uttam Kumar Reddy

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలవడం కోసం కేసీఆర్ అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అయినా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి కూర్చున్నా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ జండా ఎగురడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీని అడ్డం పెట్టుకొని ..మంత్రి జగదీశ్వర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కేసుల పేరుతో బెదిరించి స్థానిక కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి వత్తిళ్లకు లొంగని వారిపై .. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Uttam Kumar Reddy

హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసుల అరాచకాల పై త్వరలో హుజూర్ నగర్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఉత్తమ్ ప్రకటించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని హుజూర్ నగర్ లో గెలవాలనుకుంటున్న కేసీఆర్ ప్రయత్నాలను స్థానిక ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు. ఇక పాపికొండల మృతులకు పార్టీ తరపున సంతాపం ప్రకటించారు ఉత్తమ్ .

Tags: Uttam Kumar Reddy, Padmavathi,Ex MLA,KCR, Hizurnagar Bypoll, Gandhibhavan,aTrs Bhavan

Leave A Reply

Your email address will not be published.