News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తుమ్మిడిహట్టి కి తరలివెళ్లిన కాంగ్రెస్ ముఖ్యనేతలు ..!

కరీంనగర్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు తుమ్మిడి హట్టి ప్రాజెక్టును సందర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ .. మాజీ మంత్రులు .. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అసెంబ్లీ, లోక్​సభలకు పోటీ చేసిన అభ్యర్థులు .. ముఖ్యనాయకులు విజిట్ లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో బయలుదేరి .. 11 గంటలకు కాగజ్‌ నగర్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తుమ్మిడి హట్టి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించారు.

Congress

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వటం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ రీడిజైన్ వల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్ పార్టీతో పాటు నిపుణులు చెబితున్న మాట. ఈ విషయంలో .. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీ.కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Congress

- Advertisement -

ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి వద్ద నిర్మించే బ్యారేజి నుంచి గ్రావిటీ ద్వారా అతి తక్కువ ఖర్చుతో సుమారు 120 టీఎంసీ నీటిని ఎల్లంపల్లికి తరలించొచ్చని హస్తం నేతలు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికే తాము తమ్మడి హట్టి ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Congress

Tags: UTTAM KUMAR REDDY, REVANTH REDDY, BHATTI VIKRAMARKA,PONNAM PRABHAKAR,PONNALA LAXMAIAH,KCR, PRANAHITHA PROJECT, KALESHWARAM PROJECT, THUMMIDIHETTI, TELANGANA GOVERNMENT, TELANGANA EXPRESS,UTTAM KUMAR REDDY VISIT THUMMIDIHETTI

Leave A Reply

Your email address will not be published.