News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

యురేనియం అనుమతులు రద్దుచేసేవరకు ఉద్యమిస్తాం ..!

తెలంగాణలో యురేనియం తవ్వకాలకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌ దస్‌పల్లా హోటల్‌లో “యురేనియం ఆపాలి-నల్లమల పరిరక్షించాలి” అన్న నినాదంతో జరిగిన సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. రేవంత్ రెడ్డి .. కోదండరాం .. వీహెచ్ .. చాడ వెంకట్ రెడ్డి .. ప్రజా సంఘాల నాయకులు .. మేధావులు ఇతర ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం తమపై విమర్శలకు దిగుతోందంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు. యురేనియం తవ్వకాల వల్ల వెలువడే రేడియా ధార్మికత ప్రజా జీవనాన్నినాశనం చేస్తుందని .. దాని ప్రభావం కృష్ణానదీ పరివాహక ప్రాంతం అంతటిపై పడుతుందని .. నీరంతా కలుషితం అవుతుందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Uttam

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి .. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని శాసనసభలో చేసిన తీర్మాణం నాలుక గీసుకోను కూడా పనికిరాదని ఆరోపించారు. తండ్రి, కొడుకులు పద ప్రయోగంతో అసెంబ్లీ, మండలిని, ప్రజలను తప్పు దోవ పట్టించారని ద్వజమెత్తారు. కేసీఆర్‌, కేటీఆర్‌ అసెంబ్లీ, మండలిలో చేసిన ప్రకటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ అనుమతులు ఇచ్చిందని చెప్పే కంటే…కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే స్టేట్‌ ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి…గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తూ ఏక వాఖ్య తీర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలల కిందట ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సెంట్రల్‌ ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. యురేనియం తవ్వకాలతో వెయ్యి టీఎంసీలు నీరు కలుషితం కావడంమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు తెలుగు గంగ ద్వారా తాగునీ తాగే మద్రాసు ప్రజలకు కూడా తీవ్ర నష్టం వాటిళ్లుతుందన్నారు.

Pawan kalyan

- Advertisement -

ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కు హాజరైన పవన్ కళ్యాణ్ .. యురేనియం తవ్వకాలకు వ్యతిరేఖంగా జరుగుతున్న ఉద్యమంలో తానొక సైనికుడిలా పాల్గొంటానని చెంచులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ నెల 18న యురేనియం సమస్యకు వ్యతిరేకంగా జరగనున్నపాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని. సమస్య పరిష్కారం అయ్యే వరకు తాను పోరాటంలో ముందుంటానన్నారు. అభివృద్ధి పేరిట అడవులు విధ్వంసమవుతుంటే చూస్తూ ఎవరు ఏమి మాట్లాడకుండా ఎందుకు ఊరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణo నాశనమవుతుంటే తనకు చాలా బాధ కలుగుతోందని పవన్‌కళ్యాణ్‌ అన్నారు.

Uttam kumar

Tags: UTTAM KUMAR REDDY, REVANTH REDDY, PAWAN KALYAN,VH,CHADA VENKAT REDDY,KODANDARAM,YURENIYAM,MODI, AMITH SHA,KCR,KTR, ASSEMBLY, ROUND TABLE MEETING, GANDHIBHAVAN,TRS, TELANGANA,NALLAMALA FOREST

Leave A Reply

Your email address will not be published.