News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

యురేనియంపై కాంగ్రెస్ పోరాటం ఆగదు ..!

రాష్ట్రంలో యురేనియం తవ్వకాలను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తవ్వకాలపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీభవన్​లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Uttam kumar

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .. అక్టోబర్‌ లో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతోందని తెలిపారు. పార్టీ సభ్యత్వానికి బీమా అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. హుజూర్‌ నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికారపార్టీ హింసకు పాల్పడుతోందని ఉత్తమ్ ఆరోపించారు. కార్యకర్తల పట్ల పోలీసులు అక్రమ కేసులు మానుకోకుంటే … సామూహిక నిరాహారదీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు.

Uttam kumar

- Advertisement -

జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి దరఖాస్తుల చేసినా … సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై హైపవర్‌ కమిటీ వేస్తున్నామని ఉత్తమ్​ వెల్లడించారు. ఇక అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు పీసీసీ చీఫ్ తెలిపారు.

Uttam kumar

Tags: UTTAM KUMAR REDDY,KCR,KTR, YURENIYAM, NALLAMALA, FOREST, REVANTH REDDY, BHATTI VIKRAMARKA, TELANGANA GOVERNMENT, TELANGANA ASSEMBLY,GANDHI JAYANTHI, CONGRESS PARTY MEMBER SHIP

Leave A Reply

Your email address will not be published.