News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు ..!

హైద‌రాబాద్ : కేసీఆర్ స‌ర్కారు ప్రాణ‌హితా చేవెళ్ళ ప్రాజెక్ట్ ను ప‌క్క‌న పెట్టి .. మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి .. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ముందు నుంచి కాంగ్రెస్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వ‌స్తోంది. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద నీటి ల‌భ్య‌త‌లేద‌ని కేసీఆర్ చెబుతున్న నేప‌థ్యంలో .. తుమ్మడిహెట్టి వద్ద నున్న ప్రాణహిత నదిలో నీటి ల‌భ్య‌త‌ను పరిశీలించేందుకు కాంగ్రెస్ బృందం తుమ్మ‌డిహెట్టి వెళ్ళ‌నుంది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు .. ఎమ్యెల్యే లు .. మాజీ మంత్రులు .. ముఖ్య నాయకులు ఈ యాత్ర‌కు త‌ర‌లి వెళ్ళ‌నున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 38 వేల కోట్లతో 16.5 లక్షల ఎకరాలకు నీరదించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన విష‌యం తెలిసిందే. ఈ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రీ డిజైన్ పేరుతో తమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టి మెడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది.

Uttam

- Advertisement -

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని ఈ పాటికే .. ప్రాజెక్టు పూర్తి అయ్యేదని .. కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్ట్ హోదా వ‌స్తే .. ఒక్క పైసా రాష్ట్రంపై భారం కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యేదని చెబుతున్న కాంగ్రెస్ .. కేసీఆర్ తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో జ‌రుగుతున్న న‌ష్టాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంతో పాటు .. తుమ్మడిహెట్టి వద్ద నున్న ప్రాణహిత నదిలో నీటి ల‌భ్య‌త‌పై వాస్త‌వాల‌ను కూడా జ‌నం దృష్టికి తీసుకురావాల‌ని హ‌స్తం నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికోసం సోమవారం నాడు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య‌నేత‌లంతా ఈ యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. సిర్పూరు కాగజ్ నగర్ వరకు రైల్లో ప్రయాణం చేసి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రాజెక్టు సైట్ కు వెళ్లి నున్నారు కాంగ్రెస్ నేత‌లు.

Uttam

Leave A Reply

Your email address will not be published.