News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీఆర్ ఎస్ కు ప్రజలే బుద్ది చెబుతారు

తొమ్మిది నెలల టీఆర్ ఎస్ ప్రభుత్వం సంక్షేమ పధకాల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యిందని పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించింది. సూర్యూపేట జిల్లా హుజూర్నగర్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెబుతామని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదని ఉత్తమ్ ఆవేధన వ్యక్తం చేశారు.  దీన్ని బట్టే కేసీఆర్ కు మాదిగలపై ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించారు.

uttam
రాష్ట్రంలో రైతు బంధు, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో ఏ మాత్రం పారదర్శకత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఖరీఫ్ కు చెల్లించాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పటికీ రైతులకు అందలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీపై కేసీఆర్ ప్రభుత్వం నోరు ఎందుకు మెదపడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో హుజూర్నగర్ లో ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చేపట్టలేదని ఫైర్ అయ్యారు. టీఆర్ ఎస్ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొనుక్కునే సిగ్గుమాలిన రాజకీయం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి.. టీఆర్ ఎస్ లోకి వెల్లిన వారు వారికి చిత్తశుద్ది రాజీనామా చేసి ఇతర పార్టీ కండువా కప్పుకోవాలని సవాల్ విసిరారు. టీఆర్ ఎస్ పార్టీ అరాచకాలే ఎజెండాగా చేసుకుని.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Tags: uttam, pcc chief uttam, uttam fire on trs, uttam fire on kcr, pcc chief uttam fire on cm kcr, uttam fire on trs govt

Leave A Reply

Your email address will not be published.