News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

2012లో నిర్భయ ఘటన తర్వాత అత్యంత పెద్ద ఘటన ఇదే: ఉత్తమ్

హైదరాబాద్ లో మహిళా వెటినరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి పై జరిగిన అత్యాచారం.. హత్య ఘటనను పార్లమెంట్ ముక్తకంఠంతో ఖండించింది. 2012లో నిర్భయ ఘటన తర్వాత అత్యంత పెద్ద ఘటన ఇదే అని సభ్యులు లోక్ సభ, రాజ్య సభ తెలిపారు. ఇక ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. దిశాపై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దిశా తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు చాలా నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారని సభ దృష్టికి తీసుకొచ్చిన ఉత్తమ్.. ఆ తల్లిదండ్రులు తర్వాత మరో నాలుగు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వచ్చిందని చెప్పారు.

- Advertisement -

ముందు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదు స్వీకరించి వెంటనే వెతికి ఉంటే ఈ రోజు దిశా ప్రాణాలతో ఉండేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ కుమార్తె ఎవరితోనైనా వెళ్లిపోయిందా అంటూ వ్యాఖ్యలు చేసి దిశా తల్లిదండ్రులను పోలీసులు అవమానించారని ఆయన మండిపడ్డారు. కూత వేటు దూరంలో హైదరాబాదు ఉందని అక్కడ పోలీసులు పాట్రోలింగ్ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. అటు తెలంగాణ హోంశాఖ మంత్రి బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ వ్యాఖ్యలు ఇటు తల్లిదండ్రులతో పాటు చాలామందిని కలచివేశాయని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.