News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సీఏఏ పై కేసీఆర్ దోబూచులాట మానుకోవాలి: ఉత్తమ్

  • కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీఏఏ ను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి : ఉత్తమ్
  • రిజర్వేషన్లు ఖరారు కు నోటిఫికేషన్ కు మధ్య 48 గంటల వ్యవధి ఇవ్వడం సరికాదు : ఉత్తమ్

నల్గొండ : పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపిన కేసీఆర్‌.. సీఏఏ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం సరికాదన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం మునిసిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. గతంలో మునిసిపల్‌ రిజర్వేషన్లు ప్రకటించాక నోటిఫికేషన్‌ కు 10 రోజుల గడువు ఉండేదని .. ప్రస్తుత ఎన్నికలకు 48 గంటలే గడువు ఇవ్వడం సరికాదన్నారు. తగినంత సమయం కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు.

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. కులాలు, మతాలవారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే మోదీ సర్కార్ సీఏఏను తీసుకొచ్చారని, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ను ప్రతిపాదిస్తున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. కేసీఆర్‌కు దమ్ముంటే వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయాలని భట్టి సవాల్‌ చేశారు.

Tags: caa, nrc, uttam kumar reddy, nalgonda, meeting, kcr

Leave A Reply

Your email address will not be published.