News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వరంగల్ సీన్ చటాన్ పల్లిలో రిపీట్

2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వపణిక, ప్రణీతపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు. 3రోజుల అనంతరం ముగ్గురు నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన పోలీసులు..

అప్పట్లో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన అన్ని వర్గాల ప్రజలు. అప్పుడు, ఇప్పుడు ఎన్కౌంటర్ క్రెడిట్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జాన్నార్ దే….సరిగ్గా 10ఏళ్ల తరువాత సేమ్ ఇన్సిడెంట్ రిపీట్….అప్పుడు, ఇప్పుడు ఒకటే నెల డిసెంబర్ కావడం గమనార్హం.

శభాష్ పోలీస్.. సెల్యూట్ టు సజ్జనార్..

- Advertisement -

sajjanar comisioner

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో తెలంగాణ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. దిశను కిడ్నాప్ చేసిన చోటనే కేసును రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజల నుండి అభినందనలు అందుకుంటున్నారు.

పోలీసు ఉన్నతాధికారి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి, వారి బృందానికి సెల్యూట్. నర హంతకులను ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులలు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులకు, కేసును విచారిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి చిత్రపటాలకు ప్రజలు పాలతో అభిషేకం చేస్తూ శభాష్ పోలీస్ అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.