News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ చిత్రాలను తొలగించాం

యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ చిత్రంపై వెల్లువెత్తిన నిరసనల నేపధ్యంలో ప్రభుత్వం, ఆలయ కమిటీ వెనక్కి తగ్గింది. వివాదాస్పదమైన అభ్యంతరకర చిత్రాలన్నీ తొలగిచామని ఆలయ ప్రధాన స్థపతి ఆనంద్ వేలు స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ స్థూపాలపై సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ పార్టీ గుర్తైన కారు బొమ్మలను చెక్కారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్రమైన ఆలయంలో ఇలా రాజకీయాలు చేయడం సరికాదన్న వ్యాఖ్యలు విన్పించాయి.

yadadri
ఆలయాలను కూడా రాజకీయాల కోసం వాడుకోవడాన్ని అంతా తప్పుబట్టారు. అయినప్పటికీ కేసీఆర్ చిత్రాలపై ముందు సమర్ధించుకున్న యాదాద్రి ఆలయ కమిటీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది.  సీఎం కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలు తీసివేశామని, చార్మినార్, తదితర చిత్రాలను కూడా తొలగించామని ఆలయ ప్రధాన స్థపతి ఆనంద్ వేలు  తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే తొలగించే చర్యలు చేపట్టామని చెప్పారు. ఆ చిత్రాల స్థానాల్లో ఆలయ సంప్రదాయ చిత్రాలను చెక్కే పనిని మొదలు పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Tags: yadadri, yadadri temple, kcr carving in yadadri temple, kcr carvings removed from yadadri temple, kcr and car carvings removed from yadadri temple

Leave A Reply

Your email address will not be published.